calender_icon.png 15 January, 2025 | 11:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వరద బాధితులకు యశోద హాస్పిటల్స్ అండ

05-09-2024 12:57:28 AM

రూ.కోటి విరాళం అందజేత n తెలుగు రాష్ట్రాలకు మాజీ సీజేఐ రూ.10 లక్షల చొప్పున సాయం

హైదరాబాద్, సెప్టెంబర్ 4 (విజయక్రాంతి): వరద బాధితులకు సాయంగా యశోద గ్రూప్ హాస్పిటల్స్ నిర్వాహకులు రూ.కోటి విరాళం అందించారు. బుధవారం నాడు హాస్పిటల్ ఆపరేటర్స్ చీఫ్ ఆఫీసర్ శ్రీనివాస్‌రెడ్డి సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకకు చెక్కు అందజేశారు. దాతృత్వాన్ని చాటుకున్న యశోద హాస్పిటల్స్ చైర్మన్ రవీందర్ రావు, డైరెక్టర్లు సురేందర్‌రావు, దేవేందర్ రావులను డిప్యూటీ సీఎం అభినందించారు. మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ సైతం తెలుగు రాష్ట్రాలకు రూ.10 లక్షలు చొప్పున విరాళమందించారు. బుధవారం ఢిల్లీలో రెండు రాష్ట్రాల రెసిడెంట్ కమిషనర్లకు ఆయన తన నివాసంలో చెక్కులు అందచేశారు. కష్ట కాలంలో ప్రతిఒక్కరు అండగా నిలబడాలన్నారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల నిర్విరామ కృషిని జస్టిస్ రమణ అభినందించారు.