calender_icon.png 24 November, 2024 | 1:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

AUS vs IND: ఆసీస్ గ‌డ్డ‌పై య‌శ‌స్వి జైస్వాల్ రికార్డుల మోత

24-11-2024 10:45:09 AM

బోర్డర్ గావస్కర్ ట్రీఫీలో బాగంగా పెర్త్ వేదికగా జరుగుతున్న టెస్టు మూడో రోజు తొలి సెషన్ ఆట ముగిసింది. భారత్ కు భారీ ఆధిక్యం లభించింది. బోజన విరామ సమయానికి భారత్ 1 వికెట్ నష్టపోయి 275 పరుగులు చేసింది. ప్రస్తుతానికి భారత్ 321 పరుగుల ఆధిక్యంలో ఉంది. ప్రస్తుతం క్రీజులో జైస్వాల్(141), దేవ్ దత్ పడిక్కల్(25)లతో నిలకడగా ఆడుతున్నారు. కేఎల్ రాహుల్ (77) పరుగులు వద్ద స్టార్స్ ఔట్ చేశాడు. ఈ సెషన్ లో 27 ఓవర్ల ఆట సాగింది. ఇందులో భారత్ 103 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్ లో టీమిండి 150 పరుగులు చేయగా, ఆస్ట్రేలియా 104 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ మ్యాచులో యశస్వి రికార్డుల మోత మోగించాడు. మొదటి టెస్టులో ఆస్ట్రేలియాపై సెంచరీ బాదాడు. ఆసీస్ పై ఇది యశస్వి తొలి సెంచరీ. ఆస్ట్రేలియాలో ఆడిన మొదటి టెస్టులోనే శతకం కొట్టిన మూడో భారత బ్యాటర్ గా రికార్డు సృష్టించాడు. అత్యదిక వ్యక్తిగత పరుగులు సాధించిన తొలి ఇండియన్ బ్యాటర్ గా రికార్డు నమోదు చేశాడు. అంతకు ముందు సునీల్ గావస్కర్ పేరిట(113)ఈ రికార్డు ఉండేది.