బోర్డర్- గావస్కర్ ట్రోఫీ: భారత్, ఆస్ట్రేలియా మధ్య పెర్త్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు మొదటి సెషన్‌లో టీమిండియా, ఆస్ట్రేలియాను 104 పరుగులకు ఆలౌట్ చేసింది. అనంతరం ఆట మొదలు పెట్టిన భారత ఓపెనింగ్ జోడీ యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ రెండవ ఇన్నింగ్స్‌ను అద్భుతంగా ప్రారంభించారు. యశస్వి జైస్వాల్ (51) హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇది అతని కెరీర్ లో 9వ అర్ధశతకం. కేఎల్ రాహుల్ (41)తో కలిసి యశస్వి సెంచరీ భాగస్వామ్యం చేశారు. ప్రస్తుతం భారత్ 40 ఓవర్లకు వికెట్ నష్టపోకుండా 102 పరుగులు చేసింది. యశస్వి హాఫ్ సెంచరీతో కోచ్ గంభీర్ రికార్డును అధిగమించారు. 2008 క్యాలెండర్ ఇయర్ లో గంభీర్ 1,134 పరుగులు చేశాడు. ఇప్పడు జైస్వాల్ 2024లో 1,166 పరుగులతో కొనసాగుతున్నాడు. ఈ క్రమంలో 16 ఏళ్ల నాటి రికార్డును యశస్వి తుడిచిపెట్టాడు.