calender_icon.png 20 April, 2025 | 10:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యాసంగికీ ధాన్యం రికార్డే!

20-04-2025 01:01:39 AM

దిగుబడి అంచనా 127.50 లక్షల టన్నులు

  1. 70.13 లక్షల టన్నుల కొనుగోళ్లకు ఏర్పాట్లు పూర్తి
  2. కలెక్టర్లు క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను పర్యవేక్షించాలి
  3. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడి

హైదరాబాద్, ఏప్రిల్ 19 (విజయక్రాంతి): రాష్ట్రంలో యాసంగిలో రికార్డుస్థా యిలో ధాన్యం వస్తుందని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. రబీలో పండిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్టు మంత్రి తెలిపారు.

మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి శనివారం సివిల్ సప్లయ్ ముఖ్య కార్యదర్శి  డీఎస్ చౌహన్, వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, పౌర సరఫరాల శాఖా జాయింట్ కమిషనర్ ప్రియాంకా ఏలే, డైరెక్టర్ ప్రసాద్‌తో కలసి హైదరాబాద్ నుంచి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆదిలాబాద్‌లో  మంత్రి ధనసరి అనసూయ సీతక్క వీసీలో భాగస్వామ్యమయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లా డుతూ రాష్ట్రప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుందని చెప్పారు. కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటించి ఏర్పాట్లను పర్యవేక్షించాలని ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ రబీ సీజన్‌లో రైతులు 57 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారని, 127.50 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి అంచనా వేస్తున్నామన్నారు.

70.13 లక్షల టన్నుల ధాన్యం కొనుగోళ్లే లక్ష్యంగా ప్రభు త్వం ఏర్పాట్లు చేసిందన్నారు. ఈ యేడు ఖరీఫ్, రబీ కలిపి 281 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి అవుతుందని, భారతదేశంలోనే అరుదైన రికార్డని చెప్పారు. ఈ ఖరీఫ్‌లో 66.7 లక్షల ఎకరాల్లో సాగు చేస్తే 153.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చిందని వివరించారు.

కేంద్రాల వద్ద సదు పాయాల కల్పనలో ఎలాంటి లోటుపా ట్లు లేకుండా ఆయా జిల్లాల కలెక్టర్లు నిరంతరం సమీక్షించాలని మంత్రి సూ చించారు. ఖరీఫ్ సీజన్‌లో రికార్డ్ స్థాయి లో పండిన పంటను కొనుగోలు లో అధికారులు సమర్థవంతంగా వ్యహరించారని మెచ్చుకున్నారు. ధాన్యం కొను గోళ్లు సున్నితమైన అంశమని, అధికారులు అ ప్రమత్తంగా ఉంటూ మారుతున్న వా తావరణ పరిస్థితులకు అనుగుణంగా రై తులను చైతన్యం చేయాలన్నా రు.

ఏప్రి ల్ రెండోవారం పూర్తయ్యేనాటికి 8.51 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు చేరగా, ఇప్పటికే 5.77 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామన్నారు. ఇదివరకే కొనుగోలు చేసిన ధాన్యంలో సన్న రకం 3.79 లక్షల టన్నులు కాగా, 1.98 లక్ష ల టన్నులు దొడ్డు రకమన్నారు.

పటిష్ఠ నిఘా ఏర్పాటు.. 

తెలంగాణలో ముందెన్నడూ లేని రీతిలో సన్నాలకు రూ.500 బోనస్ ఇ స్తుండటంతో సరిహద్దు రాష్ట్రాల నుంచి అక్రమంగా తరలించే అవకాశాలు ఉన్నాయని, ఆ ప్రయత్నాలను అడ్డుకుం టామ ని మంత్రి స్పష్టం చేశారు. ఇందుకోసం చెక్‌పోస్ట్‌ల వద్ద పటిష్ఠ నిఘా ఏ ర్పాటు చేసినట్టు చెప్పారు. ధాన్యం కొనుగోళ్లకు బ్యాంక్ గ్యారెంటీలతో పాటు ప్రభుత్వం నుంచి ఒప్పందం కలిగిన మిల్లర్లను మా త్రమే అనుమతిస్తున్నట్టు చెప్పా రు.

సన్నాలను గుర్తించేందుకు కేర్నల్ మె ట్రిక్, మైక్రో మీటర్లలతో ఫీల్డ్ ఆఫీసర్లకు శిక్షణ ఇచ్చామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టి, అమలు చే స్తున్న సన్నబియ్యం పంపిణీలో 25 శా తం నూకలు ఉండటం భారత ఆహార సంస్థ నిబంధనలో భాగమేనన్నారు.

ఈ విషయంలో విపక్షాలు చేస్తున్న అసత్య ప్రచారం పట్ల అధికార యంత్రాంగం అ ప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు. ఫిలిప్పిన్స్‌తో కుదుర్చుకున్న ఒ ప్పందం ప్రకారం ఇప్పటికే లక్ష టన్నుల ధాన్యాన్ని ఎగుమతి చేయాలని నిర్ణయించామన్నారు. 

సన్నాలకు రూ.500 బోనస్

సన్నాలు పండించిన రైతాంగానికి బో నస్ ఎప్పటికప్పుడు వారి ఖాతాలలో జమ చేస్తున్నామని మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు. ధాన్యం కొనుగోళ్లకు రాష్ట్రవ్యాప్తం గా ప్రభుత్వం 8,329 కేంద్రాలను ప్రారంభించాలని నిర్ణయం తీసుకోగా, ఇప్పటికే 7,337 కేంద్రాలను ప్రారంభించామన్నారు. ఇవి పీఏసీసీఎస్‌ఐ, ఐకేపీ గ్రూ పుల ఆధ్వర్యంలో నడుస్తున్నాయని చె ప్పారు. నిజామాబాద్, కామారెడ్డి, సిద్దిపేట, నల్లగొండ జిల్లాల్లో పూర్తిస్థాయిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు షురువయ్యాయని చెప్పారు.

ఆయా కేంద్రాలకు గ్రేయిన్ కాలిపర్స్, ఎలక్ట్రానిక్ తూకపు మిషన్లు, మాయిశ్చర్ మీటర్లతో పాటు టార్బాలిన్లు, క్లినర్లు, హస్క్ రిమువర్ వంటి యంత్రాలను తరలించినట్టు మం త్రి వెల్లడించారు. మొత్తం 17.5 కోట్ల గన్ని బ్యాగులు అవసరం ఉండగా 9.45 కోట్లు కొత్తవి, 8.05 కోట్లు పాతవి ఏర్పాటు చేసుకుంటున్నామని చెప్పారు.

ప్రస్తుతం 9.23 కోట్ల గన్ని బ్యాగులు అందుబాటులో ఉన్నాయన్నారు. ధాన్యం నిల్వకు రాష్ర్టవ్యాప్తంగా 66.65 లక్షల టన్నుల నిల్వసామర్థ్యం కలిగిన గోదాములు ఉం డగా, అందులో 25 లక్షల టన్నుల నిల్వ చేసేందుకు అవకాశం ఉందని, మిగిలిన ధాన్యం నిల్వ కోసం వ్యవసాయ మార్కె ట్ కమిటీ, రాష్ట్ర గిడ్డంగుల సంస్థకు చెం దిన గోదాములతో పాటు ప్రైవేట్ గోదాముల్లో ఏర్పాట్లు చేస్తున్నట్టు పేర్కొన్నారు.