calender_icon.png 4 March, 2025 | 5:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యాసంగి పంటలకు నీరందించాలి

04-03-2025 02:13:06 AM

జిల్లా కలెక్టర్లతో వీసీలో సీఎస్ శాంతికుమారి

హైదరాబాద్, మార్చి 3 (విజయక్రాంతి): రాష్ట్రంలో యాసంగి సాగుకు సరిపడా సాగునీరు అందించాలని జిల్లా కలెక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశించారు. సోమవారం సచివాలయంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

యాసంగి సీజన్ పంటసాగు, రెసిడెన్షియల్ పాఠశాలల పనితీరు, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిర్మూలనకు చేపట్టిన కార్యక్రమాలపై సీఎస్ సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎస్ శాంతికుమారి మాట్లాడుతూ.. గతేడాదితో పోలిస్తే సాగు విస్తీర్ణం పెరిగిన ప్పటికి నీటా వనరుల్లో నీటి లభ్యత చాలా సౌకర్యంగా ఉందన్నారు.

వచ్చే పది రోజుల్లో విద్యుత్, నీటి సరఫరాను జాగ్రత్తగా సమన్వయం చేయాలన్నారు. జిల్లాలోని స్థానిక సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించేందుకు మండల స్థా యి బృందాలు ఏర్పాటు చేయాల న్నా రు. కాన్ఫరెన్స్‌లో వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, ఇంటర్మీడియ ట్ ఎడ్యుకేషన్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య తదితరులు పాల్గొన్నారు.