calender_icon.png 1 October, 2024 | 5:09 AM

9999 @ రూ.20 లక్షలు

01-10-2024 02:40:44 AM

వెహికిల్ ఫ్యాన్సీ నంబర్లకు యమా క్రేజ్

ఒక్కరోజే ఆర్టీయేకు రూ. 47 లక్షల ఆదాయం 

హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 30 (విజయక్రాంతి): వెహికల్ ఫ్యాన్సీ నంబర్ల క్రేజ్ మాములుగా ఉండదు. ముఖ్యంగా హైదరాబాద్ మహానగరం పరిధిలో 9 సిరీస్‌కు యమా క్రేజ్ ఉంటుంది. ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయ పరిధిలో సోమవారం ఫ్యాన్సీ నంబర్లకు జరిగిన బిడ్డింగ్‌లో టీజీ 09 బీ 9999 నంబర్ ఏకంగా రూ. 20,01,111 పలికింది. నంబర్‌ను లాట్ మొబైల్స్ ప్రైవేట్ లిమిటెడ్ దక్కించుకున్నది.

అలాగే టీజీ 09 సీ 0001 నంబర్‌ను యోడ్ స్టోర్ కంపెనీ రూ.10,27,777కు,  టీజీ 09 సీ 0006 నంబర్‌ను పోరస్ అగ్రో ఫుడ్ ప్రొడక్ట్స్ కంపెనీ రూ.3.85 లక్షలకు, టీజీ 09 0009 నంబరును దండు ఎనర్జీ కంపెనీ రూ. 2.75 లక్షలకు, టీజీ 09 సీ 0007 నంబర్‌ను సుబ్బాయమ్మ వెంపటి రూ. 1,77,777కు, టీజీ 09 బీ 9909 నంబర్‌ను మేధా విస్ట్రిన్ ప్రైవేట్ లిమిటెడ్ రూ. 1.35 లక్షలకు, టీజీ 09 సీ 0005 నంబర్‌ను గణేష్ కుమార్ మామిడిపల్లి  రూ. 1.13 లక్షలకు, టీజీ 09 సీ 0011 నంబర్‌ను జీపీఆర్ మాల్ అండ్ మల్టీప్లెక్స్ యాజమాన్యం రూ.1.4 లక్షలకు దక్కించుకున్నది. ఇలా ఆర్టీయేకు ఒక్కరోజులోనే రూ.47 లక్షల ఆదాయం లభించింది.