calender_icon.png 17 November, 2024 | 9:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విషాదాన్ని మిగిల్చిన ‘యాగి’ టైఫూన్!

12-09-2024 02:36:13 AM

  1. వియత్నాంలో 150కు చేరిన మృతుల సంఖ్య 
  2. 2,10,000 హెక్టార్లలో పంట నష్టం 

హనోయి, సెప్టెంబర్ 11: ఉత్తర వియత్నాంలో యాగీ టైఫూన్ మిగిల్చిన నష్టం అంతా ఇంతా కాదు. భారీ వర్షాలతో కొండ చరియలు విరిగిపడడం, గంటకు 300 కి.మీ చొప్పున ఈదురుగాలులు, వరద బీభత్సానికి యావత్ దేశం అతలాకుతలమైంది. టైఫూన్ తాకిడికి ఇప్పటివరకు 1౫౦ మంది మృతిచెందగా, 58 మంది గల్లంతయ్యారని బుధవారం అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. సుమారు 2 లక్షల హెక్టార్లలో పంటలు వరద పాలైందని స్పష్టం చేసింది.

క్యూయెట్ థాంగ్ కమ్యూన్ ప్రాంతంలో ప్రవహించే డైక్ నది ఉధృతంగా ప్రవహిస్తున్నది. మూడో ప్రమాద హెచ్చరిక స్థాయిని సైతం దాటింది. అలాగే రాజధాని హనోయి ప్రాంతంలో ప్రవహించే ‘రెడ్’ నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నది. థావో నది కూడా అంతే ఉధృతంగా ప్రవహిస్తున్నది. ఆయా నదుల పరీవాహక ప్రాంతాలకు చెందిన ప్రజలు ఎప్పుడు ఏ ప్రమాదం ఎదురవుతుందోనని ఆందోళనకు గురవుతున్నారు.