calender_icon.png 15 October, 2024 | 4:56 AM

యాద్రాది తరహా వేములవాడ అభివృద్ధి

15-10-2024 12:39:32 AM

ఆలయ అభివృద్ధిపై సీఎం ప్రత్యేక దృష్టి

ఆలయానికి బంగారు తాపడం, వెండి పల్లకీ, ఉత్సవమూర్తుల తయారీ 

దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ వెల్లడి

సిరిసిల్ల, అక్టోబర్ 14 : యాద్రాది తరహాలో వేములవాడ ఆలయాన్ని ఆధ్యాత్మికం గా అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు ప్ర భుత్వం చర్యలు తీసుకుంటుందని దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు.

సోమవారం రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడలో  పర్యటించిన కొండా సురేఖకు ప్ర భుత్వ విప్ ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా, ఎస్పీఅఖిల్ మహాజన్ పుష్ఫగు చ్ఛం అందజేసి స్వాగతం పలికారు. అనంతరం పోలీసు గౌరవ వందనం సమర్పిం చారు. రాజన్న ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.

స్వామివారిని దర్శనం చేసుకోని, కోడె మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ సన్నిధిలో మనుమడి పుట్టు వెంట్రుకల కార్యక్రమాన్ని పూర్తి చేశారు. ఈ సందర్భంగా కొండా సురేఖ మాట్లాడుతూ.. ఆలయ అభివృద్ధిపై సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారని, త్వర లో సీఎం స్థాయిలో అత్యున్నత సమావేశం జరుగుతుందని తెలిపారు.

భక్తులకు ఎలాం టి అసౌకర్యం కలుగ కుండా అన్ని వసతులనూ కల్పిస్తామని చెప్పారు. ప్రజా ప్రభు త్వం ఏర్పడిన వెంటనే ఆలయానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు  తలెత్తకుండా చర్యలు తీసుకున్నామని, స్థాని క ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సైతం ఆలయ అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధతో పని చేస్తున్నారని పేర్కొన్నారు.

యాదాద్రి ఆలయానికి 63 కేజీల బంగారంతో తాపడం చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసిందన్నారు. అలాగే వేములవాడ ఆలయానికి 65 కేజీల బంగారం, 5 క్వింటాళ్ల వెండి అందుబాటులో ఉందని, వీటిని వినియోగించుకోని రాజన్న ఆలయానికి సైతం బంగారు తాపడం, వెండితో పల్లకీలు, ఉత్సవ విగ్రహాలు తయారు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని స్పష్టంచేశారు.

అనంతరరం బద్దిపోచమ్మ ఆలయంలో అమ్మవారిని దర్శించుకోని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రి వెంట ఆలయ ఈవో వినోద్‌రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ మహేశ్, ఆర్డీవో రాజేశ్వర్, మాజీ జడ్పీటీసీ నాగం కుమార్ ఉన్నారు.