నియోజకవర్గ కేంద్రంలో గొల్ల కుర్మ సంఘ భవనానికి స్థలం కేటాయించి భవన ఏర్పాటుకు సహకరిస్తా
రాష్ట్రంలో ఎక్కడ మండల స్థాయిలో సదర్ జరగలేదు
రాజకీయాలకు అతీతంగా తొలిసారి మునుగోడు గడ్డపై ఘనంగా సదర్ ఉత్సవం
సదర్ ఉత్సవంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి
మునుగోడు (విజయక్రాంతి): రాష్ట్ర రాజకీయాలను శాసించే శక్తి యాదవులకు ఉందని నీతి నిజాయితీకి మారుపేరు యాదవని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. శుక్రవారం రాత్రి మునుగోడు పట్టణంలోని ప్రభుత్వ పాఠశాల ఆవరణలో మునుగోడు మండల గొల్ల కురుమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సదర్ ఉత్సవంలో రాజకీయాలకు అతీతంగా సోదర భావంతో గొల్ల కురుమ సంఘం నాయకులు ఎమ్మెల్యేకు ఘనస్వాగతం పలికారు. జ్యోతి ప్రజల్వన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించి యాదవ సోదరులతో కలిసి దున్నపోతును ఆడించారు. అనంతరం సదరు ఉత్సవ కమిటీ కన్వీనర్ బూడిద లింగయ్య యాదవ్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
యాదవ సోదరులు నీతికి నిజాయితీకి మారుపేరని కొనియాడారు. బడుగు బలహీన వర్గాలలో యాదవులు ఆర్థికంగా రాజకీయంగా ఎదగాల్సిన అవసరం ఉందన్నారు. యాదవులు రాజకీయంగా రానిచ్చేందుకు అండగా ఉంటానని అన్నారు. సదర్ ఉత్సవం ఎప్పుడు హైదరాబాద్ ప్రాంతానికి పరిమితమైందని నేడు అది మారుమూల ప్రాంతాలకు కూడా రావడం అందులో భాగంగా మునుగోడు నియోజకవర్గంలో ఏర్పాటు చేయడం హర్షనియమని, యాదవ సంస్కృతిని ఇంత ఘనంగా నిర్వహించిన సదరు ఉత్సవ కమిటీకి అభినందనలు తెలిపారు.
మునుగోడు నియోజకవర్గ కేంద్రంలో గొల్ల కురుమ సంఘ భవనం కోసం కలెక్టర్ తో చర్చించి స్థలం కేటాయింపు జరిగేలా చూస్తానని, భవన నిర్మాణానికి తన వంతుగా సహకరిస్తానని హామీ ఇచ్చారు. స్టేజిపై ఆసీనులైన రాష్ట్రస్థాయి బీఆర్ఎస్ నాయకులు యాదవుల సంఘ భవనానికి నిధులు సమకూర్చేందుకు కృషి చేయాలన్నారు. మాజీ రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ మాట్లాడుతూ.. పదవి పవర్ లేకపోయినా 10 లక్షలు నిధులను తీసుకువస్తానని సభాముఖంగా తెలియజేశారు.
సదర్ సమ్మేళన కార్యక్రమంలో మాజీ రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేష్, మాజీ కార్పొరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్, సీపీఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం,డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి, వివిధ పార్టీల నాయకులు జక్కలి ఐలయ్య యాదవ్, సాగర్ల లింగస్వామి యాదవ్, లోడంగి గోవర్దన్ రెడ్డి, అయోధ్య, దోటి వెంకటేష్, మేకల మల్లయ్య, జాల వెంకన్న, తీర్పారి వెంకన్న, బీమనపల్లి సైదులు, మాల్గ యాదయ్య, కర్నాటి స్వామి, పెంబల్ల జానయ్య, తదితరులు పాల్గొన్నారు.