ధర్మారం (విజయక్రాంతి): ధర్మారం మండలంలోని బొట్ల వనపర్తి గ్రామంలో ఇటీవల సంగ దుర్గమ్మ అనారోగ్యంతో మృతి చెందగా వారి కుటుంబ సభ్యులను ఎన్నారై కొలుముల ఫౌండేషన్ చైర్మన్ కొలుముల దామోదర్ యాదవ్ చరవాణి ద్వారా బుధవారం ధర్మారం మండల, జిల్లా స్థాయి యాదవ సంఘం నాయకులు పరామర్శించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి వేల్పుల నాగరాజు యాదవ్, మండల అధ్యక్షుడు ఆవుల ఎల్లయ్య, మండల సొసైటీ పోరం అధ్యక్షులు జంగ మహేందర్ యాదవ్, మాజీ జిల్లా డైరెక్టర్ ధరవేణి ఓదెలు యాదవ్ లు యాదవ సంఘం సీనియరు నాయకులు దుర్గమ్మ కుమారుడు సంగ బుచ్చయ్య ను, కుటుంబ సభ్యులను పరామర్శించారు. దుర్గమ్మ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఆమె మృతికి కారణాలను కాంగ్రెస్ పార్టీ నాయకులు మానవుడు సంగ రంజిత్ ను అడిగి తెలుసుకున్నారు. వారి వెంట యాదవ సంఘం నాయకులు జెల్లా సంపత్ తదితరులు ఉన్నారు.