06-03-2025 12:09:31 AM
కామారెడ్డి, మార్చి 5,(విజయక్రాంతి) : కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రానికి చెందిన యాదవ సంఘం (గొల్ల) వారి ఆహ్వానం మేరకు బుధవారం శ్రీ మల్లికార్జున ఆలయ ప్రాంగణంలో నిర్మించిన కళ్యాణ మండపం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కామారెడ్డి శాసన సభ్యులు శ్రీ కాటిపల్లి వెంకట రమణ రెడ్డి యాదవ సంఘం కళ్యాణ మండపం ప్రారంభించారు. అనంతరం ఆయనకు శాలువాలతో ఘనంగా యాదవ సంఘ సభ్యులు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో యాదవ సంఘం సభ్యులు , బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు