26-04-2025 10:14:30 PM
మంథని (విజయక్రాంతి): ఇటీవల బదిలీపై మంథని మండలానికి తహసీల్దార్ గా విచ్చేసి బాధ్యతలు స్వీకరించిన గిరివేన కుమారస్వామిని యాదవ సంఘం నాయకులు శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం తహసీల్దార్ ను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యాదవ సంఘం నాయకులు పెరవేన లింగయ్య యాదవ్, దొరగొర్ల శ్రీనివాస్ యాదవ్, బోగొండ రవి యాదవ్, కనవేన రమేష్ యాదవ్, అప్పల కుమార్ యాదవ్, కనవేన ఓదెలు యాదవ్, మొగిలి శ్రీనివాస్ యాదవ్ తో పాటు మంథని శ్రీనివాస్ పాల్గొన్నారు.