ఖమ్మం (విజయక్రాంతి): తెలంగాణ యాదవ మహాసభ ఆధ్వర్యంలో ఖమ్మం మార్కెట్ ఆవరణంలో యాదవుల ఆత్మీయ సమ్మేళనం మాజీ డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం నాయకత్వంలో ఆదివారం జరిగింది. ఈ సమావేశంలో వ్యాపార వర్గ యాదవ కమిటీ,యాదవ సంఘ కమిటీ, యూత్ కమిటీ ఎన్నుకున్నారు. వ్యాపార వర్గ కమిటీ జిల్లా అధ్యక్షులుగా చిలకల ఆదినారాయణ యాదవ్, కార్యదర్శిగా సారిక పాపారావు యాదవ్, గౌరవధ్యక్షులుగా వీర్ల వరప్రసాద్ యాదవ్, సలహాదారులు గుడిచుట్టూ వెంకటనారాయణ యాదవ్ లతో పాటు మరో 15మందితో కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దీనితో పాటు త్రీ టౌన్ యాదవ కమిటీ అధ్యక్షులుగా వల్లపు లింగయ్యయాదవ్, కార్యదర్శి నల్లబెల్లి గౌతమ్ యాదవ్, గౌరవ అధ్యక్షులుగా చెవుల శ్రీనివాస్ యాదవ్, వర్కింగ్ ప్రెసిడెంట్ రెడ్డెబోయిన కన్నయ్యలతో పాటు 27మందితో కమిటీ ఎన్నిక జరిగింది. యూత్ అధ్యక్షులుగా తోడేటి పాపయ్య, కార్యదర్శి నాలామోతు శివలతో పాటు 18 మందితో కమిటీ ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది.
ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి గుమ్మా రోశయ్య యాదవ్, వర్కింగ్ ప్రెసిడెంట్ బారి మాల్సూర్ యాదవ్, కన్వీనర్ కోడి లింగయ్య యాదవ్, 20వ డివిజన్ కార్పొరేటర్ దొడ్డ నగేష్ యాదవ్ మహిళా అధ్యక్షురాలు చిత్తారు ఇందుమతి యాదవ్, కార్యదర్శి ముక్కాల కమల యాదవ్, యూత్ అధ్యక్షులు జడ మల్లేష్ యాదవ్, కోశాధికారి కొప్పుల నర్సింహారావు యాదవ్, ఖమ్మం కార్పొరేషన్ ప్రధాన కార్యదర్శి సారికరాము యాదవ్, ఉపాధ్యక్షులు ముత్తేబోయిన లక్ష్మినారాణ, వల్లూరి తిరుపతిరావు, కమీషన్ మర్చంట్లు కోడివీరబాబు, రావుల శ్రీనివాస్, పరిటాల వీరబాబు, జంగిలి రాము, అప్పల రవి, చిన్నల మదన్, కొమ్ము మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.