ఎమ్మెల్యే కాలె యాదయ్య
చేవెళ్ల, ఆగస్టు 25: రాష్ట్రపతి గ్యాలంటరీ మెడల్‌కు ఎంపికైన హెడ్ కానిస్టేబుల్ సీ.యాదయ్యను యవత స్ఫూర్తిగా తీసుకోవాలని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య పిలుపునిచ్చారు. ఆదివారం చేవెళ్ల మండ లం మీర్జాగూడలో ఏర్పాటు చేసిన సమావేశంలో కానిస్టేబుల్ యాదయ్యను.. ఎమ్మెల్యే ఘనం గా సన్మానించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. యాదయ్య విధి నిర్వహణలో ప్రాణా లు లెక్కచేయకుండా అక్రమంగా ఆయుధాలు సరఫరా చేసే దొంగలను పట్టుకున్నారని అన్నారు. నిందితులు కత్తులతో దాడి చేసినా వెనక్కి తగ్గలేదని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రచార కమిటీ జాయింట్ కన్వీనర్ సున్నపు వసంతం, మాజీ డీసీసీ ప్రెసిడెంట్ పడాల వెంకటస్వామి, మండల నాయకులు మర్పల్లి కృష్ణారెడ్డి, ఆగిరెడ్డి, దేవర వెంకట్ రెడ్డి, వైభవ్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు.