calender_icon.png 12 March, 2025 | 2:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఐఎస్‌వో గుర్తింపు సాధించిన యాదగిరిగుట్ట దేవస్థానం

12-03-2025 01:44:24 AM

ఆధ్యాత్మిక సేవలలో, ప్రసాదం నాణ్యతా పరిరక్షణలో.. 

యాదాద్రి భువనగిరి, మార్చి 11 (విజయక్రాంతి) : యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో  ఆధ్యాత్మిక సేవలను అత్యుత్తమంగా అందించినందుకు. ప్రసాదం తయారీలో నాణ్యత ప్రమాణాలను పాటించి భక్తుల అభిమానాన్ని చూర గొన్నందుకుగాను యాదాద్రి దేవస్థానానికి రెండు ప్రతిష్టాత్మకమైన ఐఎస్‌ఓ గుర్తించిన సర్టిఫికెట్లను ఎండోమెంట్ అధికారులు అందుకున్నారు.

అనుకూలమైన ఆధ్యాత్మిక సేవలను అత్యుత్తమంగా అందించినందుకు గాను ప్రతిష్టాత్మకమైన ఐఎస్‌ఓ 9001:2015 గుర్తింపు పత్రాన్ని దేవాలయ అధికారులకు అందజేశారు. స్వామివారి ప్రసాదం తయారీ నాణ్యత ప్రమాణాలను పాటించినందుకు  ఐఎస్‌ఓ 22000:2018 గుర్తింపు పత్రాలను  అందజేశారు.

రెండు గుర్తింపు పత్రాలను ఎండోమెంట్ రాష్ర్ట ముఖ్య కార్యదర్శి శ్రీమతి శైలజ రామయ్యర్, ఆలయ ఈవో ఎం భాస్కరరావు, అనువంశిక ధర్మకర్త బి నరసింహమూర్తిలు అందుకున్నారు. శైలజ రామయ్యర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఐ ఎస్ ఓ గుర్తింపు సర్టిఫికెట్లు అందుకున్నందుకు సంతోషంగా ఉందన్నారు.

శ్రీలక్ష్మీ నరసింహస్వామి యాదగిరిగుట్ట ఆలయ అధికారులు సిబ్బంది ఆధ్యాత్మిక సేవలు అందించడంలో ప్రసాదం నాణ్యత ప్రమాణాలను పాటించి భక్తుల అభిమానం చురగొనందుకుగాను గుర్తించి ప్రతిష్టాత్మకమైన రెండు ఐ ఎస్ ఓ గుర్తింపు పత్రాలను సాధించామన్నారు.