calender_icon.png 10 January, 2025 | 10:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యాదగిరిగుట్ట సబ్ రిజిస్ట్రార్ సస్పెన్షన్

09-01-2025 12:46:21 AM

నల్లగొండ, జనవరి 8 (విజయక్రాంతి): యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్ట సబ్ రిజిస్ట్రార్ పీ గోపిపై సస్పెన్షన్ వేటు పడింది. ఆలేరు మండలం కొలనుపాలక గ్రామంలోని 473/E3, 472E3/1/2 సర్వే నంబర్లలోని అనాధికార లేవుట్‌లో 154 ప్లాట్లను నిబంధనలకు విరుద్ధంగా ఆయన రిజిస్ట్రేషన్ చేసినట్లు ఇటీవల స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులకు వంటాల జంగయ్య, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఫిర్యాదు చేశారు.

ఈ విషయంపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ జీ మధుసూదన్‌రెడ్డి నల్లగొండ జిల్లా రిజిస్ట్రార్‌కు, నల్లగొండ మార్కెట్ వ్యాల్యూ అండ్ ఆడిట్ రిజిస్ట్రార్లకు ఆదేశాలు జారీ చేశారు. వ్యవహారంపై విచారణ జరిపిన వారు కొలనుపాకలో అనాధికార లేవుట్‌లో 124 ప్లాట్లను సబ్ రిజిస్ట్రార్ గోపి నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్ చేసినట్లు నిర్ధారించారు.

ఈ మేరకు బుధవారం రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్‌కు తుది నివేదిక ఇవ్వడంతో డీఐజీ మధుసూదన్‌రెడ్డి సబ్ రిజిస్ట్రార్ గోపిని విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.