calender_icon.png 12 February, 2025 | 4:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యాదగిరిగుట్ట రికార్డ్ అసిస్టెంట్ సస్పెండ్

11-02-2025 12:00:00 AM

యాదాద్రి భువనగిరి ఫిబ్రవరి 10 (విజ యక్రాంతి) : యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయంలో రికార్డు అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న  నర్సింగ్ రావును సస్పెండ్ చేసినట్లు ఈవో ఏ భాస్కర్రావు తెలిపారు. విధి నిర్వహణలో భాగంగా కొండపైకి వెళ్లే వాహనాలకు సం బంధించి రూ.500 రుసుం వసూలు చేస్తూ అట్టి నగదును ప్రతిరోజు రోజు చాలన్ ద్వారా జమ చేయాల్సి ఉంది. కానీ అతను జమ చేయాల్సిన నగదులో రూ. 58 వేలు చెల్లించక గత రెండు రోజులుగా విధులకు హాజరు కాకుండా  తప్పించుకు తిరుగుతు న్నాడు. ఈ నేపథ్యంలో అతనిపై విచారణ జరిపి సస్పెండ్ చేస్తూ  ఉత్తర్వులు జారీ చేసినట్లు ఈవో తెలిపారు.