08-03-2025 11:32:28 PM
ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించిన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఎంపీ చామల
యాదాద్రి భువనగిరి,(విజయక్రాంతి): యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి తిరు కల్యాణ మహోత్సవం శనివారం రాత్రి కనుల పండువగా నిర్వహించారు. స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని తిలకించడానికి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలను ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి సమర్పించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా 8వ రోజు ఆలయంలో నిత్యారాధనల అనంతరం, స్వామివారిని శ్రీరామ అలంకరణ చేసి హనుమంతు వాహన సేవా నిర్వహించారు. ఉత్సవాల్లో కలెక్టర్ హనుమంతరావు, ఆలయ ప్రధాన అర్చకుడు, అనువంశిక ధర్మకర్త బి నరసింహమూర్తి, ఆలయ ఈవో భాస్కరరావు పాల్గొన్నారు.