calender_icon.png 28 January, 2025 | 8:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యాదాద్రి ఆలయానికి కార్తీక భక్తుల రద్దీ

03-11-2024 10:26:55 AM

యాదాద్రి భువనగిరి, (విజయక్రాంతి): శివ కేశవులకు ప్రీతికరమైన పవిత్ర కార్తీక మాసంలో స్వయంభూ యాదగిరి నృసింహుడి సన్నిధికి ఆదివారం భక్తులు పోటెత్తారు. కుటుంబ సమేతంగా పుష్కరిణిలో పుణ్య స్నానాలు, దీపారాధనలు ,వ్రత పూజలు ఆచరించిన భక్తులు స్వామి వారి దర్శనానికి వేకువ జామునుంచే బారులు తీరారు.దీపావళి వరుస సెలవుల కారణంగా పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడం తో స్వామి వారి ధర్మ దర్దనానికి మూడు నుంచి నాలుగు గంటల సమయం పట్టింది. వ్రత పూజలకు అదనపు ఏర్పాట్లు చేసారు దీపారాధనలు , పుణ్య స్నానాలకు కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు అధికారులు తెలిపారు.