04-03-2025 12:44:37 AM
మత్స్యావతారంలో భక్తులకు దర్శనమిచ్చిన శ్రీ లక్ష్మి నరసింహుడు
యాదాద్రి భువనగిరి, మార్చి 3 (విజయక్రాంతి) ః యాదాద్రిశ్రీ లక్ష్మీనరసింహుడి వార్షిక బ్రహ్మోత్సవాలు కనుల పండుగగా వైభవపేతంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాలను కనులారా చూసి భక్తులు జన్మ ధన్యమైంది అంటూ మొక్కులు తీర్చుకుంటున్నారు.
బ్రహ్మోత్సవాలలో భాగంగా సోమ వారం ఉదయం స్వామి వారి ఆలయంలో నిత్యారాధన అనంతరం ఉదయం 9 గంటలకు శ్రీ స్వామివారిని మత్యావతారంలో అలంకరించి ఆలయ ప్రధాన అర్చకులు, ఉప ప్రధాన అర్చకులు, యజ్ఞాచార్యులు, వేద పండితులు, అర్చక బృందం, పారాయణికులు. ఆలయ మాడవీధులలో అత్యంత వైభవంగా ఊరేగించారు.
మత్స్యావతార విశిష్టత...
లోక కళ్యాణార్థం భగవానుడు అవతరించిన అవతారాలలో మొదటిది మత్స్యావ తారం. బ్రహ్మోత్సవాలలో శ్రీ స్వామివారిని మత్సావ నరసింహునిగా అలంకరించి మహోత్సవం నిర్వహించుట ఎంతో ప్రత్యేకమైనది. ఒకనాటి కల్పాంత సమయమును సోమాకాసురుడు అను రాక్షసుడు బ్రహ్మ నుండి వేదములను అపహరించి జలార్నవములో నీకి పారిపోయాను. భగవానుడు వేదములను రక్షించి తిరిగి బ్రహ్మదేవునికి అప్పగించనని మత్స్య పురాణం తెలియజేస్తుంది. భక్త రక్షణలో భగవానునికి గల విలక్షణమైన దయా గుణమునకు సంకేతంగా ఈ అవతార వైభవము సూచించ బడుతుందని పండితులు పేర్కొన్నారు.
శేష వాహన సేవ ప్రత్యేకత...
బ్రహ్మోత్సవాలలో శ్రీ స్వామి వారు శేష వాహనాదారుడై తిరువీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శన భాగ్యము కలిగించుట ఎంతో విశేషమై ఉన్నది. శేషుడు శేయ్యంగా, గొడుగుగా, సింహాసనముగా, పాదుకగా, రత్నదీపమైన, వాహనముగా పలు విధాలైన సేవలందిస్తూ తన దాస్య భక్తితో స్వామివారి సేవలో తరిస్తాడు. శేషశాయి అయిన స్వామి వారు జీవాత్మ, పరమాత్మల అవినాభావ ఐక్యతకు ప్రతీక. అరిషత్ గారాలని అడగలతో సర్ప సమాన శరీరంతో ఉన్న జీవుడితో శయనించి వెలిగి ఆత్మని దైవం.
విష జ్వాల లాంటి దుర్గుణాల్ని ప్రకటితం చేసే అరిషడ్వర్గాలాన్ని అంతరింప చేసుకుంటే తప్ప పండగ పుత్తెరను పైకి ఎత్తితే తప్ప అంతర్వర్తి అయిన పరమాత్మ స్వరూప దర్శనం కాదని ఈ వాహన సేవ అంతరార్థమని ప్రధాన అర్చకులు వివరించారు.శ్రీ స్వామివారి ఊరేగింపు కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వాణా అధికారి భాస్కరరావు, అనువంశిక ధర్మకర్త బి నరసింహ మూర్తి, ఆలయ ప్రధాన అర్చకులు, ఉప ప్రధాన అర్చకులు. వేద పండితులు. అర్చక బృందం పారాయనీకులు. వందలాదిమంది భక్తులు పాల్గొన్నారు.
సాహిత్య, సంగీత మహాసభలు...
బహ్మోత్సవాల సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా యాదాద్రి కొండపై ధార్మిక సాహిత్య సంగీత మహాసభలు జరుగుతున్నాయి. ప్రముఖ సహస్రావధాని పద్మశ్రీ డాక్టర్, గరికపాటి నరసింహారావు చేత నృ సింహ వైభవం అని ఆధ్యాత్మిక ప్రవచనం నిర్వహిస్తున్నారు. బ్రహ్మశ్రీ శ్రీనివాస శర్మ హైదరాబాద్ వారికి పోతన భాగవత తత్వం పై ఉపన్యాసం, భీమవరానికి చెందిన శ్రీ పాల రామాంజనేయ భాగవతార్ గారిచే హరికథ సీతా కళ్యాణం.
వినయకృష్ణ హైదరాబాద్ వారిచే వాయిలిన్ శాస్త్రీయ సంగీ తం కుమారి సురపనేని అనన్య బృందంచే కూచిపూడి నృత్యం భూదాన్ పోచంపల్లి మార్కండేయ భజన మండలి వారిచే భజన కార్యక్రమం మైలార్ గూడెం కు చెందిన జైశ్రీరామ్ భక్త భజన మండలి వారిచే భజన కార్యక్రమం ఆస్థానం వారిచే మంగళ వాయి ద్యం వైదిక ప్రార్ధనలు నిర్వహించారు.