హైదరాబాద్: నల్గొండ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం పర్యటిస్తున్నారు. సీఎం, డిప్యూటీ సీఎం దామచర్లకు చేరుకున్నారు. యాదాద్రి పవర్ ప్లాంట్ యూనిట్-2 రేవంత్ రెడ్డి ప్రారంభించారు. రెండో యూనిట్ లో విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించి ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు. వైటీపీఎస్ యూనిట్-2లో 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కానుంది. ఈ కార్యక్రమంలో మంత్రులు భట్టి విక్రమార్క, దామోదర రాజనర్శింహ పాల్గొన్నారు. యాదాద్రి థర్మల్ ప్లాంట్ ఫోటో ప్రధర్శనను సీఎం తిలకించారు. యాదాద్రి థర్మల్ ప్లాంట్ పనులను సీఎం , మంత్రులు పరిశీలించారు.