మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి, తుమ్మల, పొన్నం
ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా నేడు ప్రారంభించనున్న సీఎం రేవంత్‌రెడ్డి
ఎస్సెల్బీసీ వద్ద రాజీవ్ గాంధీ ప్రాంగణంలో బహిరంగ సభ
ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు
నల్లగొండ, డిసెంబర్ 6 (విజయక్రాంతి): యాదాద్రి పవర్ ప్లాంట్ చరిత్రలో నిలిచిపోతుందని, ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా సీఎం రేవంత్‌రెడ్డి ప్లాంట్‌లోని రెండో యూనిట్‌ను నేడు ప్రారంభిస్తారని మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రవాణాశాఖ మం త్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. శనివారం నల్లగొండ జిల్లాలో సీఎం పర్యటన నేపథ్యంలో నార్కెట్‌పల్లి మండలం బ్రాహ్మణవెల్లంల ప్రాజెక్ట్, దామరచర్ల మండలం యాదాద్రి పవర్ ప్లాంట్ వద్ద ఎమ్మెల్యేలు వేముల వీరేశం, బత్తుల లక్ష్మారెడ్డితో కలిసి మంత్రులు ఏర్పాట్లను పరిశీలించి, మీడియాతో మాట్లాడారు.
రానున్న నాలుగేండ్లు మరింత అంకితభావంతో ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఏడాది పాలనలో రాష్ట్రంలో నీటిపారుదల, విద్యుత్ రంగాలు మరింత పురోగతి సాధించాయని తెలిపారు. వచ్చే ఏడాది మార్చినాటిని పను లు పూర్తి చేసి పూర్తిస్థాయి విద్యుదుత్పత్తిని ప్రారంభించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నదన్నారు. నల్లగొండ పట్టణ శివారులోని గంధవారిగూడెం వద్ద నర్సింగ్ కళాశాలకు, నల్లగొండలో మహిళ నైపుణ్యాభివృద్ధి కేంద్రానికి, గ్రంథాలయ భవనానికి, కనగల్, తిప్పర్తి మండలాల జూనియర్ కళాశాలకు సీఎం శంకుస్థాపన చేయనున్నట్లు పేర్కొన్నారు.
సాయంత్రం ఎస్సెల్బీసీ వద్ద రాజీవ్ గాంధీ ప్రాంగణంలో బహిరంగ సభలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగిస్తారని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, అభిమా నులు భారీగా తరలివచ్చి సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మం త్రుల వెంట కలెక్టర్ ఇలా త్రిపాఠి, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్, ఎస్పీ శరత్‌చంద్ర పవార్, అదనపు ఎస్పీ రాములనాయక్, డెయిరీ డెవలప్‌మెంట్ సొసైటీ చైర్మన్ గుత్తా అమిత్‌రెడ్డి, నల్లగొండ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్‌రెడ్డి, కాంగ్రెస్ పట్టణాధ్యక్షుడు గుమ్ముల మోహన్‌రెడ్డి తదితరులున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో మల్టీ జోన్ ఐజీ సత్యనారాయణ, ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌తోపాటు పోలీసు ఉన్నతాధికారులు ఏర్పాట్లను సమీక్షించారు.
జాతికి అంకితం!
హైదరాబాద్, డిసెంబర్ 6 (విజయక్రాంతి): యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్‌లో మరో కీలక ఘట్టం ఆవిష్కరణ కానున్నది. 800 మెగావాట్ల సామర్థ్యంతో ఐదు యూ నిట్లుగా మొత్తం 4000 మెగావాట్లతో నిర్మిస్తున్న వైటీపీఎస్‌లో శనివారం రెండో యూనిట్‌ను సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి జాతికి అంకి తం చేయనున్నారు. నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెం వద్ద థర్మల్ విద్యుత్తు ప్రాజెక్టుకు 17 అక్టోబర్ 2017లో శంకుస్థాపన చేశారు.
అయితే పర్యావరణ అనుమతులు, కరోనా కారణంగా తీవ్ర జా ప్యం జరిగింది. కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ నుంచి తుది అనుమతులను మే నెలలో వచ్చాయి. ఈ థర్మల్ పవర్ స్టేష న్ దేశంలోనే ప్రభుత్వ రంగ సంస్థ ఆధ్వర్యం లో ఒకేచోట నిర్మిస్తున్న అతిపెద్ద థర్మల్ విద్యుత్తు కేంద్రం. నిర్మాణ కాంట్రాక్టును కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన బీహెచ్‌ఈఎల్‌కు రూ.29,965.48 కోట్లకు అప్పగిం చారు. పనుల ఆలస్యం కారణంగా ప్రాజెక్టు ఖర్చు పెరిగి రూ.34,400 కోట్లకు చేరింది.