calender_icon.png 22 October, 2024 | 11:22 PM

యాదాద్రి పరిసర ఆలయాలతో టూరిజం సర్క్యూట్

29-07-2024 12:41:59 AM

రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేశ్ రెడ్డి

యాదాద్రి భువనగిరి, జూలై 28 (విజయక్రాంతి): యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ సందర్శనకు వచ్చే భక్తుల కోసం పరిసర ఆలయాలు, పర్యాటక ప్రదేశాలతో టూరిజం సర్క్యూట్ ఏర్పాటుకు యోచిస్తున్నట్టు రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేశ్ రెడ్డి తెలిపారు. ఆదివారం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని సందర్శించిన ఆయన, ఘాట్ రోడ్డు వెంట గల హరిత హోటల్‌ను పరిశీలించారు. యాదాద్రి ఆలయ సమీపంలోని కొలనుపాక, కొమురవెల్లి, పెంబర్తి, భువనగిరి చ్‌వనగిరి వంటి ప్రదేశాల సందర్శనకు ఈ సర్క్యూట్ ఉపయోగపడుతుందని తెలిపారు. కొలనుపాకను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయడానికి సీఎం రేవంత్‌రెడ్డితో చర్చిస్తామని చెప్పారు. యాదగిరి కొండపైకి రోప్‌వే ఏర్పాటుకు కూడా ప్రతిపాదనలు చేస్తున్నట్టు తెలిపారు. హరిత హోటల్‌లో ప్రస్తుతం 15 గదులు ఉపయోగంలో లేవని, వాటి పునరుద్ధరణ చేపడుతున్నట్లు తెలిపారు.