విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన మండల ప్రత్యేక అధికారికి షోకాజ్ నోటీసు
సమయ పాలన పాటించని ముగ్గురు వైద్యాధికారుల పై ఆగ్రహం
యాదాద్రి భువనగిరి (విజయక్రాంతి): ఆలేరు మండల స్పెషల్ ఆఫీసర్ గోపాల్ కు కొత్తగా జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన హనుమంత రావు షోకాజ్ నోటిస్ జారీ చేసారు. శుక్రవారం నాడు ఉదయం జిల్లా కలెక్టర్ ఎం.హనుమంతరావు ఆలేరులో సామాజిక సర్వే కార్యక్రమాన్ని పరిశీలిస్తున్న సందర్భంగా ఆలేరు మండల స్పెషల్ ఆఫీసర్ విధులకు హాజరు కాకపోవడంపై షోకాజు నోటీసు జారీ చేశారు. సమయపాలన పాటించని అధికారులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఇంటింటి సామాజిక సర్వే కార్యక్రమానికి స్పెషల్ ఆఫీసర్లు, అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని, సర్వే కార్యక్రమాన్ని పటిష్టంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.