calender_icon.png 10 March, 2025 | 5:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వైభవంగా యాదాద్రి బ్రహ్మోత్సవాలు

05-03-2025 01:30:14 AM

  • వటపత్రశాయి అలంకార సేవలో భక్తులకు దర్శనమిచ్చిన శ్రీ లక్ష్మి నరసింహుడు 
  • స్వామివారిని దర్శించుకొని తరించిన భక్తజనం 

యాదాద్రి, భువనగిరి మార్చి 4 (విజయక్రాంతి): అఖిలాండ బ్రహ్మాండ నాయకుడైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు కనుల పండుగగా వైబోవపేతంగా భక్తుల జై జై ధ్వనాల మధ్య కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో నా లుగో రోజైన సోమవారం నాడు స్వామివా రు వటపత్ర సాయి అలంకార సేవలో తిరువీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శనమి చ్చారు.

స్వామివారి ఆలయంలో నిత్యారా ధనల అనంతరం స్వామివారిని వటపత్ర సాయి అలంకార సేవలో అలంకరించి. ఆల య ప్రధాన అర్చకులు, యజ్ఞాచార్యులు వే ద పండితులు అర్చక బృందం, మాడ వీధులలో ఊరేగించారు. అందులోది మంది భ క్తులు స్వామివారిని దర్శించుకుని తన్మయం చెందారు.

అలంకార సేవ ప్రత్యేకత

భగవానుడు వివిధ అలంకారాలలో ఈ లోకంలో అవతరించి భక్తకోటిని సంరక్షించు తీరు ఎంతో విలక్షణమైనది. వటపత్ర పత్ర సాయి అనగా మర్రి ఆకుపై పవళించిన పరమాత్మ యొక్క బాల ముకుందా స్వరూపం. సృష్టికి పూర్వం సమస్త జగత్తులను తన ఊదరములో నిలుపుకొని కరా ర విందాం తో తన మదార వింధమును ముఖార వింధముతో నింపుకొని సమస్త చరాచర జగన్నాటక ప్రకృతి స్వరూపాలకు అమృతదా రులను కురిపించే అపూర్వ తత్వమే ఈ వటపత్ర సాయి స్వరూపమని పండితులు వివరించారు.

రాత్రి వేళలో భక్తులను సాంస్కృతిక కార్యక్రమాలు భజన కార్యక్రమాలు అలరించాయి. ఈ బ్రహ్మోత్సవాల నాలుగో రోజు కార్యక్రమంలో అనువంశిక ధర్మకర్త నరసింహా మూర్తి, ఆలయ ఈవో భాస్కర్ రావు, ప్రధాన పూజారుడు అర్చకులు యజ్ఞాచార్యులు భక్తులు పాల్గొన్నారు.