యాదాద్రి భువనగిరి ఫిబ్రవరి 5 ( విజయ క్రాంతి ) : ప్రభుత్వ గుర్తింపు పొందిన విద్యాసంస్థల యాజమాన్యాల సంఘం ట్రస్మా యాదాద్రి భువనగిరి జిల్లా కార్యవర్గ ఎన్నికలు మంగళవారం సాయంత్రం స్థానిక దివ్యభాల విద్యాలయంలో జరిగాయి. ముఖ్యఅతిథిగా రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు కందాల పాపిరెడ్డి , రాష్ట్ర అధ్యక్షులు ఎస్ ఎన్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ సారథ్యంలో ఎన్నికలు నిర్వహించారు.
జిల్లా గౌరవ అధ్యక్షులు గా గాదె సోమిరెడ్డి, జిల్లా గౌరవ సలహాదారుగా మెరుగు మధు, జిల్లా అధ్యక్షులుగా పాలకూర్లవెంకటేశం, ప్రధాన కార్యదర్శిగా దాసరి శ్రీరాములు, మహిళా కార్యదర్శిగా వెల్దుర్తి భాగ్యలక్ష్మి, కోశాధికారిగా వంగూరు పాండు,జిల్లా కార్యనిర్వహక అధ్యక్షుడిగా కృష్ణంరాజు ఎన్నికయ్యారు.
కార్యక్రమంలో ట్రస్మా రాష్ట్ర కమిటీ సభ్యులు కొండవీటి మధుసూదన్ రెడ్డి, మల్లికార్జున మల్లారెడ్డి, సింగన బోయిన సత్యనారాయణ, మల్లికార్జున్ జిల్లాలోని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు పాల్గొన్నారు. త్వరలో జిల్లాలోని రెండు రెవెన్యూ డివిజన్ కమిటీలు పూర్తిస్థాయి జిల్లా కమిటీ నియామకం జరగనున్నదనీ పాలకూర్ల వెంకటేశం తెలిపారు.