calender_icon.png 30 January, 2025 | 10:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రీజినల్ రింగ్ రోడ్, రింగ్ రైలు ప్రాజెక్టులతో మారనున్న యాదాద్రి భువనగిరి దశ

29-01-2025 12:12:29 AM

  • ఆకాశానికి భూముల ధరలు రియల్ వ్యాపారులకు
  • కాసుల పంట త్రిబుల్ ఆర్ అలైన్మెంట్ మార్చేది లేదా...!

యాదాద్రి భువనగిరి, జనవరి 28 ( విజయ క్రాంతి ): హైదరాబాద్ మహానగరం చుట్టూ 340 కిలోమీటర్ల మేర రీజినల్ రింగ్ రోడ్డుతో పాటు రింగ్ రైల్ ప్రాజెక్టులు ఏకకాలంలో చేపట్టడానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ఈ నేపథ్యంలో  హైదరాబాదు నగరానికి కూత వేట దూరం లో ఉన్న వెనుకబడ్డ యాదాద్రి భువనగిరి జిల్లా అన్ని రంగాలలో అభివృద్ధి చెందను న్నది.

రీజినల్ రింగ్ రోడ్డుతో హైదరాబా దును మరింతగా విస్తరించాలన్న ఆలోచన లో ఉన్న ప్రభుత్వం రీజినల్ రింగ్ రైల్వే లైన్ నిర్మాణానికి సంబంధించిన అంశాన్ని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకురాగా 25 రీజినల్ రింగ్ రైల్వే లైన్లతో ఏర్పాటు చేస్తామని రైల్వే శాఖకు 13.95 కోట్లు కేటాయించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు.

రింగ్ రైలు ప్రాజెక్టును సైతం చేపడితే ఒకే సమయంలో వేగంగా పనులు పూర్తవు తాయి. రింగ్ రోడ్డు చుట్టూ 60 శాతం పట్టణీకరణ జరుగుతుందని ప్రభుత్వం భావిస్తుంది. అదేవిధంగా 200 కిలోమీటర్ల పరిధిలో ఆటోమొబైల్, ఇవి వాహన తయారీ పరిశ్రమలు భారీగా వచ్చిపారి శ్రామిక అభివృద్ధి. పెద్ద ఎత్తున జరుగు తుందని ప్రభుత్వం భావిస్తుంది. తద్వారా త్రిబుల్ ఆర్ పరిసరాల్లో భూముల ధరలు పెరిగి రియల్ ఎస్టేట్ వేగవంతంగా పుంజు కోనున్నది. 

గత సంవత్సరం కాలంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం డమాల్ కావ డంతో రియాల్టర్లు వాటిపై ఆధారపడ్డ వేలాదిమంది మీడియేటర్లు ఆర్థిక ఇబ్బం దులు ఎదుర్కొంటున్నారు. ఎటువంటి సాగునీటి వసతి లేక  ఎడారి భూములుగా మారిన యాదగిరిగుట్ట, భువనగిరి, చౌటు ప్పల్, వలిగొండ ప్రాంతాల భూములకు రెక్కలు వచ్చి భూ యజమానులకు కాసుల పంట పండనున్నది. రియల్ ఎస్టేట్ వ్యాపారమే కాకుండా అన్ని రకాలుగా వెనుకబడ్డ ఈ ప్రాంతం అభివృద్ధి  చెందే అవకాశాలు ఉన్నాయి.

ఇప్పటికే త్రిబుల్ ఆర్ రోడ్ నిర్మాణం పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్న నేపథ్యంలో పరిసర ప్రాంతాల భూముల రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయి. భూ యజమానులు తమ భూములకు లక్షల నుండి కోట్ల రూపాయల ధరలను మార్కెట్లో పెడుతూ కొనుగోలుదారుల కోసం ఎదురుచూస్తున్నారు. యాదాద్రి జిల్లాలో ముఖ్యంగా త్రిబుల్ ఆర్ రోడ్డు వెళ్లే మార్గంలో ఒక ఎకరం భూమి కోటి నుండి ఐదు కోట్ల వరకు ధర పలుకుతుంది.

పూర్తిగా రోడ్డు నిర్మాణమై వినియోగంలోకి వస్తే ఎకరం 5 నుంచి 10 కోట్ల వరకు పలికిన ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు. ఈ నేపథ్యంలో భూ యజమానులు త్రిబుల్ ఆర్ రోడ్డు నిర్మాణం కోసం ఎదురుచూస్తూ తమ అభివృద్ధి కూడా దానిపైనే ఆధారపడి ఉందని భావిస్తున్నారు.

త్రిబుల్ ఆర్ భూ బాధితులు మాత్రం తమకు నష్టపరిహారం ఇవ్వకపోగా అలైన్మెంట్ ను మార్చాలని డిమాండ్ చేసిన ప్రభుత్వం పట్టించుకోక నిర్లక్ష్యం చేస్తూ తమ జీవితాలతో ఆటలాడుకుంటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

యాదాద్రి జిల్లాలో దాదాపు రెండువేల మంది రైతులు భూములు కోల్పోయిన వారు ఉన్నారు. ఇటీవలనే వారంతా జేఏసీగా ఏర్పడి అలైన్మెంటల్ మార్చాలని కోరుతూ టిఆర్‌ఎస్, బిజెపి పార్టీల మద్దతు భువనగిరి కలెక్టర్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ధర్నా రాస్తారోకో నిర్వహించారు.