25 May, 2026 | 1:02 AM

భక్తజన సంద్రంగా యాదాద్రి

25-05-2026 12:25 AM

వాహనాలతో కిక్కిరిసిన రింగ్ రోడ్

యాదగిరిగుట్ట, మే 24 (విజయకాంతి): యాదగిరిగుట్ట  లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకునేందుకు ఆదివారం రాష్ట్రం నలుమూలల నుంచి వేల సంఖ్యలో భక్తులు చేరు కున్నారు. సుమారు 70 నుంచి 80 వేల మంది స్వామివారిని దర్శించుకున్నట్టు ఆల య అధికారులు తెలిపారు. వాహనాల రద్దీ పెరగడం కొండపైన స్థలం తక్కువ ఉండడంతో వాహనాలను పైకి అనుమతించ లేదు. కొండ కింద రింగ్ రోడ్డు వాహనాలతో కిక్కిరిసింది.

ధర్మ దర్శనానికి మూడు గంటలు, స్పెషల్ దర్శనానికి రెండు గంటల సమయం పట్టింది. స్వామివారి దివ్య క్షేత్రం లో నిత్య పూజా కైంకర్యాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. సుప్రభాత సేవతో స్వయంభు లను వేదమంత్రోచ్ఛరణలు, మంగళ వాయిద్యాల నడుమ పంచామృతాలతో అభిషే కించి తులసీదళాలలను అర్పించారు. ప్రాకారమంటపంలో సుదర్శన నరసింహ హో మం, నిత్య కళ్యాణం పండితులు ఘనంగా నిర్వహించారు.