14-02-2025 01:40:27 PM
తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు, ప్రముఖ నటుడు విజయ్‌కు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వై కేటగిరీ భద్రతను మంజూరు చేసింది. ఈ మేరకు మంత్రిత్వ శాఖ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం ప్రకారం, విజయ్‌కు ముప్పు పొంచి ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. నిఘా, ముప్పు అంచనాల ఆధారంగా ప్రభుత్వం భద్రత స్థాయిని నిర్ణయిస్తుంది.