18-04-2025 06:08:12 PM
వైరా మున్సిపల్ మాజీ వైస్ ఛైర్మన్ ముళ్లపాటి సీతారాములు
వైరా,(విజయక్రాంతి): ఖమ్మం జిల్లా వైరా కేంద్రంలోని. శిలువ మార్గము క్రైస్తవులు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ బహిరంగ సిలువ మార్గమునకు వైరా మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ ముళ్లపాటి సీతారాములు పాల్గొని క్రైస్తవులతో కలసి సిలువ ఎత్తుకొని కొంత దూరం ప్రయాణించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవాళి పాపాలను ఆయన తనపై వేసుకుని సిలువ మరణం పొందారని అన్నారు.
ఏసుప్రభు చూపినటువంటి శాంతి, దయ, కరుణ, సేవ మొదలగు గుణాలను ఆయన మానవాళికి అందించారని తెలిపారు. అంతేకాకుండా ఎవరైతే పేదలకు సహాయం చేస్తారో అక్కడ నేను ఉంటాను అని. ఇతరులకు చేసే సహాయం నాకే సహాయం చేసినట్టే అని ఆయన అన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో క్రైస్తవ పెద్దలు,నాయకులు తదితరులు పాల్గొన్నారు.