calender_icon.png 8 January, 2025 | 9:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారీ పోలీసు బందోబస్తు మధ్య లిఖిత అంతియయాత్ర

08-01-2025 12:02:26 AM

ఘట్ కేసర్ (విజయక్రాంతి): ప్రేమజంటను వేధింపులకు గురిచేసి వారి ఆత్మహత్యకు కారణమైన యువకుడి ఇంటిముందు లిఖిత(17) కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు మంగళవారం ధర్నాకు దిగారు. దీంతో పోచారం మున్సిపాలిటీ, మక్తా గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. మంగళవారం గాంధీ ఆస్పత్రిలో లిఖిత శవానికి పోస్టుమార్టం ముగియాగానే నేరుగా మృతదేహాన్ని పోచారం మున్సిపాలిటీ మక్తా గ్రామంలోని నిందితుడు ముంత మహేష్ (చింటూ) యాదవ్ ఇంటి వద్దకు తీసుకోచ్చి ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు మక్తా గ్రామానికి చేరుకొని ఆందోళనను విరమించే ప్రయత్నం చేశారు. మృతదేహానికి మహేష్ ఇంటి ముందే దహన సంస్కరణలు చేస్తామని బాలిక బందువులు, గ్రామస్తులు బీష్మించుకు కూర్చున్నారు.

బాలిక మృతికి కారణమైన మహేష్ ను కఠినంగా శిక్షించి ఉరి తీయాలని, తమకు న్యాయం జరిగే వరకు ఇక్కడి నుంచి కదలమని నినాదాలు చేశారు. మృతదేహన్ని మహేష్ ఇంటి ఆవరణలోనే దహనం  చేసేందుకు కట్టెలు పెట్టి నిప్పంటిస్తుండగా శవాన్ని తీసివేయించి చెదరగొట్టారు. అయిన వినకుండా కట్టెలకు నిప్పంటించారు. తమకు న్యాయం జరిగే వరకు ఇక్కడి నుంచి కదలమని నినాదాలు చేశారు. ఇంటిపైకి ఎవరిని రానివ్వకుండ పోలీసులు వారిని బయటకు పంపించారు. మల్కాజిగిరి ఏసీపీ చక్రపాణి, స్థానిక సీఐ రాజువర్మలు బాలిక బంధువులను సముదాయించి అక్కడి నుంచి పంపించారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య లిఖిత అంతిమయాత్ర కొనసాగింది. కాగా, నిందితుడు మహేష్ కీసర పోలీసుల ముందు లొంగిపోయినట్లు సమాచారం పోలీసులు అన్ని కోణాల్లో మహేష్ ను విచారిస్తున్నట్లు తెలిసింది.