calender_icon.png 4 February, 2025 | 4:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లిఖితపూర్వకంగా దోపిడీ

04-02-2025 01:23:15 AM

  • అప్పుడే డబ్బులు ఇస్తున్నందుకు రూ 1:50 అదనపు వసూల్ 
  • లేదంటే 20 రోజులు ఆగి డబ్బులు తీసుకోండి
  • అడిగింది ముట్టజెప్పి వచ్చిన కాడికి తీసుకుంటున్న పల్లి రైతులు

మహబూబ్ నగర్, ఫిబ్రవరి 3 (విజయ క్రాంతి): మార్కెట్ యార్డులో కొందరు కమిషన్ ఏజెంట్లు దర్జాగా దండుకుం టుండ్రు. ఇప్పటికే అప్పులు సప్పులు చేసి పల్లి పండించిన రైతులకు కొందరు కమిషన్ ఏజెంట్లు లిఖితపూర్వకంగా రాసి వందకు రూ 1.50 లు పర్సంటేజీ తీసుకుంటుండ్రు.

డబ్బులు వెంటనే కావాలంటే అదనంగా డబ్బులు ఇవ్వవలసిందే అంటూ కమిషన్ ఏజెంట్లు రైతుల దగ్గర మొండి ప్రదర్శన ప్రదర్శిస్తున్నారు. చేసేదేమీ లేక రైతులు ఇది నిజమేనేమో తీసుకున్న కడిగి తీసుకున్న తర్వాత వచ్చిన కాడికి డబ్బులు ఇవ్వండి సారు కూలి వాళ్లకు, అప్పులు తెచ్చిన వారికి ఇవ్వాలని కమిషన్ ఏజెంట్ల దగ్గర తమ ఆవేదన చెప్పుకుని వచ్చిన డబ్బులు తీసుకెళ్తున్నారు. 

తక్ పట్టిపై దర్జాగా రాస్తున్న కమిషన్ ఏజెంట్లు

రైతు విక్రయానికి తెచ్చిన పల్లి ఎన్ని సంచులు ఉన్నాయి? ఎంత మేరకు టెండర్ కావడం జరిగింది? ఎన్ని క్వింటాళ్లు అయ్యా యి? ఎన్ని డబ్బులు వచ్చాయి? కమిషన్ ఏజెంట్ కమిషన్ ? చాట, దడవాయి, కూలీ ? అన్ని ప్రశ్నలకు సమాధానాలు కమిషన్ ఏజెంటు ప్రతి రైతుకు తక్ పట్టి రసీదును ఇవ్వడం జరుగుతుంది. నియమ నిబంధనల ప్రకారం కమిషన్ ఏజెంట్ అన్ని ఖర్చులు తీసేసి మిగిలిన డబ్బులు రైతుకు అప్పగిం చాలి. కాగా ఇక్కడ అది జరగడం లేదు.

ఖర్చులు అన్ని నిబంధనలను తీసేసిన తర్వా త కూడా వచ్చిన డబ్బులకు రూ 1.50 కమిషన్ తీసుకొని మిగిలిన డబ్బులు రైతు కు అప్పగిస్తుండ్రు. ఈ వివరాలను కూడా  తక్ పట్టి లో కొందరు కమిషన్ ఏజెంట్లు పొందుపరుస్తున్నారు. తప్పు అని తెలిసిన కూడా దర్జాగా కమిషన్ ఏజెంట్లు రైతు ను మోసం చేస్తూ కమిషన్ తీసుకోవడంతో పాటు అదనంగా వసూలు చేస్తుండ్రు. 

ఇవ్వవలసిందే...

రైతుకు అప్పటికప్పుడు డబ్బులు కావా ల్సింది అంటే కచ్చితంగా రూ 1:50 ఇవ్వవ లసి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తు న్నారు. కమిషన్ ఏజెంట్లను అడిగిన కూడా కచ్చితంగా ఇవ్వాల్సిందేనని అందరూ ఇస్తు న్నారని చెప్పడం జరుగుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తుండ్రు.

నియంత్రించ వలసిన అధికారులు లిఖితపూర్వకంగా ఇస్తేనే తప్ప చర్యలు తీసుకోవడంలో వెను కంజ వేస్తున్నారని తెలుస్తుంది. అధికారుల పర్యవేక్షణ వ్యవసాయ మార్కెట్‌పై ఏమా త్రం ఉందో తక్ పట్టి వివరాలను చూస్తే తెలుస్తుంది.

అదనంగా ఇవ్వకుంటే 20 రోజు లు ఆగి బిల్లు తీసుకోవాలని కమిషన్ ఏజెం ట్లు చెబుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  ఇకనైనా అధికారులు స్పందిం చి రైతుకు అందించవలసిన అందేలా చూడవలసిన అవసరం ఎంతైనా ఉంది. 

 పరిశీలిస్తాను

రైతుకు నిబంధన ప్రకారం ఖర్చులు మాత్రమే తీసుకోవాలి. కమిషన్ తీసుకు న్న తర్వాత కూడా రైతుకు డబ్బులు అందించడంలో నూటికి రూ 1:50 వ సూలు చేస్తున్నారని విషయం తెలియ దు. ఈ విషయంపై ప్రత్యేక సమావేశం పెట్టి అందరికీ తెలియజేస్తాను. రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసు కుంటాం. 

 బెక్కరి అనిత మధుసూదన్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్, మహబూబ్ నగర్

అదనంగా తీసుకున్నారు...

విక్రయించిన పల్లికి మార్కెట్ యాడ్ నిబంధన ప్రకారం డబ్బులు తీసుకో వడం జరిగింది. కాగా అప్పుడే డబ్బులు ఇస్తున్నందుకు నూటికి రూ 1:50 తీసు కుంటున్నారు. నాకు వచ్చిన 1,6,948 లలో మార్కెట్ అన్ని ఖర్చులు కలిపి రూ 3,127 ఇవ్వగా అదనంగా రూ 1870 ఇవ్వడం జరిగింది. ఇలా తీసుకుంటే ఎ లా బతకాలి. అధికారులు కొంచెం స్పం దించి మాకు రావాల్సిన డబ్బులు వచ్చే లా చూడాలి. 
 -నరేష్, రైతు