calender_icon.png 19 March, 2025 | 8:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఒత్తిడి లేకుండా పరీక్షలు రాయండి: చీకటి కార్తీక్

19-03-2025 01:17:23 AM

ఆర్టీఏ కమిటీ సభ్యులు బాదర్ల జోషి తో కలిసి పరీక్షా కిట్ల పంపిణి

పాల్వంచ, మార్చి18 ( విజయక్రాంతి): 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు రాసే విద్యార్థులు ఒత్తిడికి గురి కాకుండా ప్రశాంతంగా రాయాలని యూత్ కాంగ్రెస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షులు చీకటి కార్తీక్ సూచించారు.  మండల పరిధిలోని కెపి జగన్నాధపురంలోని ప్రభుత్వ జెడ్పి హైస్కూల్ లో రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆధారిటీ కమిటీ సభ్యులు జోషి ఆధ్వర్యంలో మంగళవారం విద్యార్థులకు పరీక్షా ప్యాడ్లు, పెన్, పెన్సిల్, స్కెల్ తో కూడిన పరీక్ష కిట్స్ లను చీకటి కార్తీక్ పంపిణి చేశారు.

ఈ సందర్బంగా విద్యార్థు లు ఒత్తిడిని జయించి సమర్థవంతంగా పరీక్షలు రాసేలా ప్రణాళికలను రూపొందించు కోవాలని సూచించారు. పరీక్షల సమయం దగ్గర పడుతుందని ఆందోళన చెందకుండా ఏకాగ్రతతో చదువుపై దృష్టి సారించాలని తెలిపారు. విద్యార్థులపై తల్లిదండ్రులు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకునేలా పరీక్షలు రాసి ఉత్తమమైన ఫలితాలను పొందాలన్నారు.

భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరేలా విద్యార్థులకు పలు రకాల మార్గదర్శకం చేశా రు. ఈ క్రమంలో గ్రామ పెద్దలు బానోత్ బాలాజీ నాయక్, ధర్మపురి ప్రసాద్, దంతూ జు కామాచారి, తిప్పిరెడ్డి లచ్చిరెడ్డి, బానోత్ కుమార్, భూక్య ప్రసాద్, మాజీ విద్యా కమిటీ చైర్మన్ నాగారం కాలనీ నల్లమోతు పవన్, వన్నాపురం నరేష్, మాలోత్ బాబురావు తదితరులు పాల్గొన్నారు