calender_icon.png 12 October, 2024 | 6:58 AM

కథ రాయండి వస్తా..

10-10-2024 12:00:00 AM

స్టార్ హీరోయిన్ సమంత కొంతకాలంగా ముంబైకే పరిమితమైంది. హైదరాబాద్‌కు వచ్చినా కూడా ఏదో చుట్టపు చూపుగా వచ్చి వెళుతోంది. తాజాగా ‘జిగ్రా’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం సమంత హైదరాబాద్ వచ్చింది. ఇందులో సమంత, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, రానా దగ్గుబాటి అతిథులుగా పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ వేదికపై త్రివిక్రమ్.. సమంత హైదాబాద్‌కు రాకపోవడంపై సరదాగా సెటైర్లు పేల్చారు.

“నేను ‘అత్తారింటికి దారేదీ’ సినిమా తీశా. సమంతకు ‘హైదరాబాద్‌కి దారేది’ అని మనం ట్విట్టర్‌లో ట్రెండ్ చేసి మరీ చెప్పాలి” అంటూ అక్కడి ప్రేక్షకులకు పురమాయింపుగా చెప్పారు. ముంబైలోనే కాకుండా అప్పుడప్పుడు హైదరాబాద్‌కి సైతం వచ్చి వెళ్లాలని సమంతను కోరారు.

దీనిపై సమంత స్పందిస్తూ.. మీరు కథ రాస్తే వస్తానంటూ వేదికపై ఉన్న త్రివిక్రమ్‌కు సైగలు చేస్తూ తెలిపింది. దీనికి ఆయన ప్రతిస్పందనగా ‘మీరు రారేమోననే భయంతో రాయడం లేదు.. మీరు వస్తానంటే రాస్తాను’ అని జవాబిచ్చారు. దీంతో తాను వస్తానన్నట్టుగా సమంత సైగలు చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.