బీజేపీ, బీఆర్ఎస్లపై మంత్రి పొన్నం ఫైర్
రామగుండం, నవంబర్ 18: బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల తీరు ఢిల్లీలో గస్తీ, గల్లీలో కుస్తీ అన్నట్లు ఉన్నదని రావాణ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్ అన్నారు. సోమవారం మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారానికి వెళ్తూ.. పెద్దపల్లి జిల్లాలోని రామగుండంలో ఎమ్మెల్యే మక్కన్‌సింగ్‌తో కలిసి క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు.
మహారాష్ట్రలో గెలిచేది కాంగ్రెస్ పార్టీయేనని ధీమా వ్యక్తం చేశారు. కేటీఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయద్దని ప్రచారం చేస్తున్నారని, అంటే బీజేపీ పార్టీ ఓటు వేయమన్నట్టే కదా అన్నారు.