30-03-2025 10:34:49 PM
బాన్సువాడ (విజయక్రాంతి): ఉగాది పండుగ పర్వదినం సందర్భంగా కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలోని బీర్కూర్ లో ఆదివారం సాయంత్రం కుస్తీ పోటీలు నిర్వహించారు. మల్లయోధులు పాల్గొని తమ నైపుణ్య ప్రదర్శన ప్రదర్శించారు. కుస్తీ పోటీల్లో పాల్గొన్న మల్లయోధులకు మొదటి బహుమతి 5000 నగదు ద్వితీయ బహుమతి మూడువేల నగదు నిర్వాకులు ప్రకటించారు. గెలుపొందిన వారికి నగదు పురస్కారం అందజేసినట్లు గ్రామస్తులు తెలిపారు.