19-04-2025 12:37:29 AM
బాన్సువాడ, ఏప్రిల్ 18 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణ కేంద్రంలో బేతాళ స్వామి ఆలయ కమిటీ అధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన కుస్తీ పోటీలకు ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. కుస్తీ పోటీల లో భాగంగా మొదటి బహుమతి మద్నూర్ మండలం అంతాపుర్ గ్రామానికి చెందిన గంగారాం 11000/- రూపాయల నగదు పొందారు.
నగదుబహుమతిని పోచారం శ్రీనివాస్ రెడ్డి బహూకరించారు. ఈ కుస్తీ పోటీలకు రెండు రోజులు ముందే మహారాష్ట్ర, కర్ణాటక, రాష్ట్రాల నుంచే కాక ఇతర గ్రామాల నుండి ప్రజలు బాన్సువాడకు చేరు కున్నారు. ఈ కుస్తీ పోటీల్లో బాన్సువాడ మండల నాయకులు, ప్రజా ప్రతినిదులు,కుస్తీ పోటీదారులు పాల్గోన్నారు.