calender_icon.png 18 April, 2025 | 7:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా జరిగిన కుస్తీ పోటీలు

09-04-2025 10:59:07 PM

పిట్లం (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా పిట్లం మండలంలోని చిన్న కొడప్గల్ గ్రామంలో కుస్తీ పోటీలు ఉత్సాహంగా నిర్వహించబడ్డాయి. స్థానిక యువకులు ఉత్సాహంగా పాల్గొన్న ఈ పోటీల్లో గోద్నాగం గ్రామానికి చెందిన దత్తు ప్రతిభను ప్రదర్శించి విజేతగా నిలిచాడు. విజయం సాధించిన ఆయన ఐదు కులాల వెండి కడియాన్ని గెలుచుకుని అనేక మంది కుస్తీ ప్రేమికుల ప్రశంసలు పొందాడు. పోటీలకు విశేష స్పందన లభించగా, పాల్గొన్న బౌకరణలు తమ హోరాహోరీ పోరాటంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ క్రీడా సమరానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎంపిటిసి వెంకటరామిరెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ జర నాగిరెడ్డి హాజరై, విజేతలకు అభినందనలు తెలిపారు.