calender_icon.png 1 March, 2025 | 12:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఓలా శివాలయంలో కుస్తీ పోటీలు

28-02-2025 08:00:23 PM

నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కుంటాల మండలంలోని ఓలా గ్రామంలో గల శివాలయంలో గురువారం కుస్తీ పోటీలను నిర్వహించారు. ఈ పోటీలకు జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన మల్లయోధులతో పాటు మహారాష్ట్రలోని ధర్మాబాద్ బోకర్ పర్భని పున నాందా రాటి తదితర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో మల్లయోధులు వచ్చి కుస్తీ పోటీలో పాల్గొన్నారు. మొదటి బహుమతి గెలిచిన సాయినాథ్ కు 5000 నగదు బంగారు కడియం రెండో గెలిచిన సురేష్ కు మూడు వేలు వెండి ఉంగరం గ్రామస్తుల ఆధ్వర్యంలో బహుమతి అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు నిర్వాకులు పాల్గొన్నారు.