calender_icon.png 29 April, 2025 | 9:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎల్లమ్మ జాతరలో కుస్తీ మే‘సవాల్’

25-04-2025 12:42:13 AM

కంగ్టి, ఏప్రిల్ 24: కంగ్టి మండల పరిధిలోని తడ్కల్ గ్రామ శివారులో గల ఎల్లమ్మ జాతర గురువారం ఘనంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం ఆనవాయితీ ప్రకారం తడ్కల్ గ్రామస్తుల ఆధ్వర్యంలో కుస్తీ పోటీలు నిర్వహిస్తారు. కుస్తీ పోటీలలో తలబడేందుకు మహారాష్ట్ర, కర్ణాటక నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుండి మల్ల యోధులు భారీగా తరలివచ్చారు. ఒకరికొకరు నువ్వా నేనా అన్నట్లుగా మల్ల యోధులు కుస్తీలో పోటా పోటీగా తలబడ్డారు.

చివరి కుస్తీలో గెలుపొందిన మల్ల యోధుడికి ఐదు తులాల వెండి కడియం బహుమతిగా అందిస్తారని అన్నారు. పోటీలను తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా ప్రజలు తరలివచ్చి ఎల్లమ్మ దర్శనం చేసుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఎస్త్స్ర విజయ్ కుమార్ తన బృందంతో  బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు శ్యామ్ రావు, శోభన్ రావు, పెద్ద మల్లారెడ్డి, మనోహర్, చిన్న మల్లారెడ్డి, రమేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.