calender_icon.png 8 October, 2024 | 7:25 PM

జులానా నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా రెజ్లర్ వినేశ్ ఫొగాట్ గెలుపు

08-10-2024 04:50:35 PM

హర్యానా,(విజయక్రాంతి): హర్యానా అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ హ్యాట్రిక్ దిశగా కొనసాగుతుంది. హర్యానాలో ఆప్ ఒక్క స్థానంలోనూ ఆధిక్యంలో లేకుండాపోయింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తలకిందులు చేసింది. జులానా నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా రెజ్లర్ వినేశ్ ఫొగాట్ గెలుపు సాధించారు. బీజేపీ అభ్యర్థి యోగేష్ కుమార్ పై 6015 ఓట్ల మెజారిటీలో వినేశ్ ఫొగాట్ గెలిచారు. హిసార్ లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన సావిత్రి జిందాల్ విజయం సాధించారు.