calender_icon.png 14 March, 2025 | 12:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్రీడాకారులకు సింగరేణి ప్రోత్సహం

13-03-2025 06:17:17 PM

ఏరియా యాక్టింగ్ జిఎం విజయ ప్రసాద్

మందమర్రి, (విజయక్రాంతి): సింగరేణి యాజమాన్యం(Singareni Management) క్రీడారంగానికి ప్రాధాన్యతనిస్తూ క్రీడాకారులను ప్రోత్సహిస్తుందని ఏరియా యాక్టింగ్ జిఎం విజయ ప్రసాద్(Area Acting GM Vijaya Prasad) స్పష్టం చేశారు. పట్టణంలోని సిఈఆర్ క్లబ్ లో బుధవారం రాత్రి వర్క్ పీపుల్ స్పోర్ట్స్&గేమ్స్ అసోసియేషన్ (డబ్ల్యూపిఎస్ జిఏ) 60వ క్రీడా వార్షికోత్సవం వేడుకల(WPS GHA 60th Sports Anniversary Celebration)కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.సింగరేణి యాజమాన్యం ఉద్యోగులకు ప్రతి ఏటా క్రీడలను నిర్వహిస్తు వారిని ప్రిత్సహిస్తుందన్నారు. ఈ పోటీలలో పాల్గొన్న క్రీడాకారులు కళాకారులు కోల్ ఇండియా స్థాయిలో ప్రతి సంవత్సరం అనేక  బహుమతులు సాధించి సంస్థకి పేరు ప్రఖ్యాతలు తీసుకు వస్తున్నారని ఆయన స్పష్టం చేశారు. సీనియర్ క్రీడాకారులు సంస్థలో పనిచేస్తున్న యువ ఉద్యోగులను క్రీడల వైపు ప్రోత్సహించాలని కోరారు.

క్రీడలు మానసిక ఉల్లాసానికే కాకుండా శరీర దృఢత్వానికి తోడ్పడతాయని, ఉద్యోగి ఆరోగ్యంగా ఉన్నప్పుడే సంస్థ అభివృద్ధి సాధిస్తుందన్నారు. అనంతరం  ఏరియా, కోల్ ఇండియా స్థాయిలో మెడల్స్ సాధించిన కళాకారులకు, క్రీడాకారులకు, ఘనంగా సన్మానించి బహుమతులు అందజేశారు.ఈ కార్యక్రమంలో ఎఐటియుసి బ్రాంచ్ కార్యదర్శి సలేంద్ర సత్యనారాయణ, సీఎంఓఏఐ అధ్యక్షులు రమేష్, డివైపిఎం (చీఫ్ కోఆర్డినేటర్ డబ్ల్యూపీఎస్ జిఏ) మైత్రేయ బంధు, సీనియర్ పి.ఓ కేకే -5 ఎం కార్తీక్, క్రీడల గౌరవ కార్యదర్శి డబ్ల్యూపీఎస్ జిఏ స్పోర్ట్స్ కోఆర్డినేటర్ శివ,  జనరల్ కెప్టెన్ శ్రీను, క్రీడాకారులు పాల్గొన్నారు.