calender_icon.png 23 October, 2024 | 7:59 AM

వావ్ వెకిక్

10-07-2024 12:13:56 AM

  • సెమీస్ చేరిన క్రొయేషియా ప్లేయర్ 
  • మెద్వెదెవ్ ముందంజ 
  • జొకో అలవోక విజయం

టెన్నిస్ చరిత్రలో మరే ఆటగాడికి సాధ్యంకాని రీతిలో పురుషుల సింగిల్స్‌లో 24 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన సెర్బియా వీరుడు నొవాక్ జొకోవిచ్.. మరో ట్రోఫీ దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నాడు. ప్రతిష్ఠాత్మక వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో వరుస విజయాలతో దూసుకెళ్తున్న ప్రపంచ రెండో ర్యాంకర్ జొకోవిచ్ క్వార్టర్‌ఫైనల్లో అడుగుపెట్టాడు. మహిళల సింగిల్స్‌లో డొన్న వెకిక్ సెమీఫైనల్‌కు దూసుకెళ్లగా.. పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్ సిన్నెర్‌కు షాకిస్తూ.. మెద్వెదెవ్ సెమీస్‌లో అడుగుపెట్టాడు. 

లండన్: సీజన్ మూడో గ్రాండ్‌స్లామ్ టోర్నీ వింబుల్డన్‌లో సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్ క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టాడు. ఆల్ ఇంగ్లండ్ సెంట్రల్ కోర్ట్ ఇప్పటికే ఏడు టైటిళ్లు గెలిచిన జొకో.. ఎనిమిదో ట్రోఫీ రెండడుగుల దూరంలో నిలిచాడు. మంగళవారం తెల్లవారుజామున జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో రెండో సీడ్ జొకోవిచ్ 6 6 6 హోల్గర్ రూన్‌పై విజయం సాధించాడు. ఆట ఆరంభం నుంచి అటాకింగ్ గేమ్‌తో విరుచుకుపడిన జొకోవిచ్.. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా వరుస సెట్లలో విజయం సాధించాడు.

5 ఏస్‌లు కొట్టిన జొకో.. 21 విన్నర్లు సంధించగా.. 3 ఏస్‌లకే పరిమితమైన రూన్.. 29 అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకున్నాడు. క్వార్టర్స్‌లో మినార్‌తో జొకోవిచ్ అమీతుమీ తేల్చుకోనున్నాడు. పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్ సిన్నెర్‌పై ఐదో ర్యాంకర్ మెద్వెదెవ్ విజయం సాధించాడు. మంగళవారం జరిగిన హోరాహోరీ పోరులో మెద్వెదెవ్ 6 (7/9), 6 7 (7/4), 2 6 సిన్నెర్‌ను చిత్తుచేశాడు. నాలుగు గంటల పాటు నువ్వా నేనా అన్నట్లు సాగిన మ్యాచ్‌లో ఇరువురు ఆటగాళ్లు కొదమసింహాల్లా పోరాడారు. 

అన్‌సీడెడ్‌గా అడుగుపెట్టి.. 

కెరీర్‌లో ఇప్పటి వరకు ఒక్కసారి కూడా గ్రాండ్‌స్లామ్ సెమీఫైనల్ చేరని క్రొయేషియా ప్లేయర్ డొన్నా వెకిక్ ఆల్‌ఇంగ్లండ్ క్లబ్‌లో అద్భుతం చేసింది. పురుషుల సింగిల్స్ క్వార్టర్స్‌లో అన్‌సీడెడ్ వెకిక్ 5 6 క్వాలిఫయర్ లూలు సున్ రాడోవిక్ (న్యూజిలాండ్)పై విజయం సాధించింది. రెండు గంటల పాటు సాగిన పోరులో తొలి సెట్ కోల్పోయిన వెకిక్.. ఆ తర్వాత అద్భుతంగా పుంజుకొని వరుస సెట్లలో సత్తాచాటింది. మ్యాచ్‌లో 11 ఏస్‌లు కొట్టిన వెకిక్.. 32 విన్నర్లు సంధించగా.. రాడోవిక్ 10 ఏస్‌లు కొట్టి.. 27 విన్నర్లకు పరిమితమైంది.