పొంగి ప్రవహిస్తున్న వాగులు.. వంకలు
లోతట్టు ప్రాంతాలు జలమయం
పలు పట్టణాలు, గ్రామాల్లో ఇళ్లలోకి నీళ్లు
భయం గుప్పిట్లో ప్రజలు
సహాయక చర్యలు చేపడుతున్న అధికారులు
రాష్ట్రంలోని అన్ని జిల్లాలో వర్షం బీభత్సం సృష్టిస్తున్నది. శనివారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో గ్రామాలు తల్లడిల్లాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇళ్లల్లోకి నీరు వచ్చి చేరింది. వాగులు పొంగి రోడ్లపైకి నీరు వచ్చి చేరడంతో పలు చోట్ల రాకపోకలు నిలిచిపోయాయి. కొన్నిచోట్ల వరదలో పలువురు గల్లంతయ్యారు. ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ, వరంగల్ జిల్లాలో వర్షం బీభత్సం సృష్టించింది.
జనగామ, సెప్టెంబరు ౧ (విజయక్రాంతి): జిల్లాకేంద్రంతో పాటు గ్రామాలన్నీ జలమయమయ్యాయి. రాత్రికిరాత్రే కుంటలు, చెరువుల్లోకి భారీగా నీరు చేరడమే కాకుండా వాగులు, కాలువల్లో వరద నీరు ఉప్పొంగింది. వాగులు ఉధృతంగా ప్రవహించడ ంతో చాలా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అధికారులతో ఎప్పటికప్పుడు జిల్లాలో పరిస్థితు లపై అధికారులతో సమీక్షిస్తున్నారు. దేవరుప్పుల వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ఆదివారం ఉదయం 80 గొర్రెలు వాగులో కొట్టుకుపోయాయి. వాగులో చి క్కుకుపోయిన ఇద్దరు కాపరులను మండ ల రెవెన్యూ అధికారులు క్షేమంగా బయటికి తీసుకువచ్చారు.
నిజామాబాద్ జిల్లాలో
నిజామాబాద్(విజయక్రాంతి): నిజామాబాద్ జిల్లాలో చెరువులు, కుంటలు, ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. నిజామాబాద్ నగరానికి తాగునీరు అందించే మంచిప్ప చెరువు పూర్తి స్థాయిలో నిండి, అలుగు పారుతోంది. మోర్తాడ్ మండలంలో ని పెద్దవాగు ప్రాజెక్టు, కమ్మర్‌పల్లి మండలంలోని రాళ్లవాగు ప్రాజెక్టులకు పెద్ద ఎత్తున వరద వచ్చి చేరుతోంది.
నాగర్‌కర్నూల్ జిల్లాలో
నాగర్‌కర్నూల్(విజయక్రాంతి): జిల్లాలో మూడు రోజులుగా కురుస్తున్న వానతో చెరువులు, కుంటలు నిండి అలుగు పారుతున్నా యి. దుందుబీ నది ఉప్పొంగడంతో పరివాహక గ్రామాలన్ని జలదిగ్బంధంలో చిక్కుకు న్నాయి. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనుల్లో భాగంగా నాగర్‌కర్నూల్ మండలం శ్రీపురం గ్రామ శివారులోని సొరంగ మార్గంలోకి వర్షపు నీరు ప్రవహిస్తూ కనిపించింది. దీనిపై అదికారులు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కానీ అందులో పనులు కొనసాగుతుండగా ఆస్థి నష్టంతోపాటు ప్రాణనష్టం కూడా జరిగి ఉంటుందని స్థానికులు అనుమానిస్తున్నారు. జిల్లాలోని పలు చెంచుపెంటల్లోనూ వరద ఉధృతికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అమ్రాబాద్ మండలం వెంటేశ్వర్ల బావి గ్రామ సమీపంలోని చౌటగూడెం రెండురోజులుగా విద్యుత్ అంతరాయం ఏర్పడి చీకట్లోనే మగ్గుతోంది. సుమారు 30 చెంచు కుటుంబాలల్లో దాదాపు 104మంది నివసిస్తుండగా వారంతా వరద తాకిడిలో చిక్కుకున్నారు.
గద్వాల, వనపర్తి జిల్లాల్లో
గద్వాల/వనపర్తి(విజయక్రాంతి)/అలంపూర్: వనపర్తి, గద్వాల జిల్లాల్లో వర్షం బీభత్సం సృష్టించింది. వాగులు, వంకలు, చెరువులు నిండి అలుగులు పారాడంతో పలు చోట్ల రాకపోకలు పూర్తి స్థాయిలో బంద్ అయ్యాయి. అలంపూర్ నియోజకవర్గం రాజోళి మండల శివారులోని సుంకే సుల డ్యాంపై రాజోళి వైపునకు గల కరకట్ట ఆదివారం కోతకు గురైంది. ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి ఆదేశాల మేరకు ఎమ్మెల్యే విజేయుడు కరకట్టను ఎర్రమట్టితో మరమ్మతులు చేయించారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రతి అధికారి బాధ్యతగా వ్యవహరించాలని కలెక్టర్ సంతోష్ అన్నారు.
మహబూబ్‌నగర్ జిల్లాలో
మహబూబ్‌నగర్(విజయక్రాంతి): మహబూబ్‌నగర్ పట్టణంలోని శ్రీనివాస్‌కాలనీ, జగ్జీవన్‌రాంనగర్ కాలనీలోని ఇండ్లలోకి వర్షపునీరు చేరింది. హన్వాడ మండలం వేపూర్ వాగులో ఉన్న 33 కేవీ విద్యుత్ స్తంభం విరిగిపోవడంతో దాదాపు 20 గ్రామలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. జడ్చర్ల నియోజకవర్గంలో దుదు ంబి వాగు పొంగిపొర్లింది. రంగనాయక స్వామి గుట్టపై కొండ చరియాలు విరిగిపడ్డాయి. పాత బజార్ శివాలయం చెరువు నిండి అలుగు పారడంతో పద్మవతి కాలనీలో ఇండ్లలోకి వర్షపునీరు చేరింది. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి కలెక్టర్ విజయేందిర బోయితో కలిసి పర్యటించారు. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి జడ్చర్లలోని లోతట్టు ప్రాంతాలను పరిశీలించారు. మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మహబూబ్‌నగర్ పట్టణంలో పర్యటించారు.
ఆదిలాబాద్ జిలాలో
ఆదిలాబాద్(విజయక్రాంతి): తలమడుగు, తాంసి, జైనథ్, బేలా, ఇంద్రవెల్లి, బోథ్, ఆదిలాబాద్ రూరల్, ఉట్నూర్, నార్నూర్, గాదిగూడ మండలాలలో వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. భీంపూర్ మండలంలోని గుబిడి, అందర్ బంద్, ధనోర్, వడూర్ గ్రామాల్లో పెన్‌గంగ నుంచి బ్యాక్ వాటర్ రావడంతో పలు గ్రామాల్లో ఇళళ్లోకి వరద నీరు వచ్చి చేరింది.
ఆసిఫాబాద్ జిల్లాలో
కుమ్రంభీం ఆసిఫాబాద్(విజయక్రాంతి): తిర్యాణి మండలంలోని ఉల్లిపట్ట డోర్లీ వాగు, ఆసిఫాబాద్ మండలంలోని వెంకటాపూర్, తుంపల్లి, గుండి వాగులు, చింతలమానేపల్లి మండలంలోని కేతిని వాగు, కెరమెరి, వాంకిడి, జైనూర్, పెంచికల్‌పేట్ మండలాల్లో వాగులు ఉప్పొంగాయి. కాగజ్‌నగర్, ఆసిఫాబాద్ పట్టణంలోని పలు కాలనీల్లో వర్షం నీరు రోడ్లపైకి వచ్చింది.
నిజామాబాద్ జిల్లాలో
నిజామాబాద్(విజయక్రాంతి): జిల్లా వ్యాప్తంగా ఉన్న చెరువులు, కుంటల్లోకి వరద నీరు వచ్చి చేరింది. వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.
సిరిసిల్ల జిల్లాలో
రాజన్న సిరిసిల్ల(విజయక్రాంతి): జిల్లాలోని మానేరు, మూలవాగులు పొంగిపొర్లుతున్నాయి. సిరిసిల్ల ప్రధాన రోడ్లన్నీ నీటితో నిండి పోయాయి. వేములవాడ బోయిన్‌పల్లి మధ్యలో గంజి వాగు పొంగడంతో ప్రయాణాలు నిలిచిపోయాయి. వేములవాడ సిరికొండ రూట్లో ప్రయాణాలు నిలిపివేశారు. వేములవాడ గ్రామీణ మండలం హనుమాజీపేట గ్రామంలో నక్క వాగు పొంగడంతో ప్రయాణాలు నిలిచిపోయాయి. కోనరావుపేట మండలం నిమ్మపల్లి చెరువు అలుగు పారుతుండటంతో మూలవాగు ఉదృతంగా ప్రవహిస్తుంది. వేములవాడ, సిరిసిల్ల పట్టణాల్లోని పలుచోట్ల పాత ఇండ్లు కూలిపోయాయి. వేములవాడ పట్టణంలోని ప్రభుత విప్ ఆది శ్రీనివాస్ పర్యటించి ప్రజలకు సూచనలు చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ అఖిల్ మహాజన్ పర్యటించారు.
జగిత్యాల జిల్లాలో
జగిత్యాల(విజయక్రాంతి): భారీ వరాలకు జగిత్యాల జిల్లా అంతా అతలాకుతలా మౌతుంది. పలు గ్రామాలు జలదిగ్బంధం అయ్యాయి. ఇళ్లల్లోకి నీరు చేరి ప్రజల కష్టాలు పడుతున్నారు. పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కథలాపూర్ మండ లం గంభీర్‌పూర్, తాండ్రియాల గ్రామాల్లో ఇళ్లల్లోకి నీరు చేరింది.
కామారెడ్డి జిల్లాలో
కామారెడ్డి(విజయక్రాంతి): జిల్లాలోని నిజాంసాగర్, కళ్యాణి, సీంగితం, మంజీర ప్రాజెక్ట్‌లోకి వరుద నీరు వచ్చి చేరుతుంది. లోతట్టు ప్రాంతాల్లో ఇండ్లలోకి వరుద నీరు వచ్చి చేరడంతో ప్రజలలు ఇబ్బందులు పడ్డారు. కామారెడ్డి పెద్ద చెరువు పోంగిపోర్లుతుంది. మాచారెడ్డి మండలం పాల్వంచ వాగు, అడ్లూర్ ఎల్లారెడ్డి పెద్ద వాగు,లింగంపేట పెద్దవాగు, గాంధారి పెద్దవాగు పోంగి పోర్లుతున్నాయి. ఎల్లారెడ్డి బీసీ కాలనీ, కొత్తబాది ప్రాంతాల్లో, వెంకట్‌రామాయ్య కాలనీ, అయ్యప్పగుడి ప్రాంతంలో భారీగా వర్షం నీరు వచ్చి చేరింది.
నిర్మల్ జిల్లాలో
నిర్మల్(విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో చెరువులు 625 ఉండగా 480 చెరువులు నిండి అలుగు పారుతున్నాయి. పెంబి, ఖానాపూర్, దిలావార్‌పూర్, లింబా, ఓల, రేకిని, సిద్ధాపూర్, తానూర్, మామడ, దస్తూరాబా ద్ ప్రాంతాల్లో వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. నిర్మల్, భైంసా పట్టణాల్లోని లోత ట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. కలెక్టర్ అభిలాష అభినవ్ జలమయం అయిన ప్రాంతాలను సందర్శించారు.
పెద్దల్లి జిల్లాలో
పెద్దపల్లి(విజయక్రాంతి): గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పెద్దపల్లి జిల్లా అతలకుతలం అవుతుంది. పెద్దపల్లి పట్టణంలోని కలెక్టర్ కార్యాలయ సమీపంలో ప్రధాన రహదారి పై నీళ్లు పొంగిపొర్లడంతో ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గోదావ రిఖనిలో వర్షం భారీగా కురువడంతో ఫైఇంక్లున్ మోరీ నిండుగా ప్రవహించడంతో మంథ ని, బేగంపేట, ఓడేడు ప్రాంతాలకు ప్రయాణించే వాహనాలు బంద్ చేశారు.