బర్త్ డే, మ్యారేజ్ డే, గెట్ టు గెదర్ సందర్భం ఏదైనా సరే హోరెత్తించే పాటలకు స్టెప్పులు వేయడం ట్రెండ్‌గా మారింది. డ్యాన్స్ అనగానే చాలా మందిలో యూత్‌కు మాత్రమే సంబంధించిన యాక్టివిటీ అనే భావన ఉంది. కానీ ప్రస్తుత హైఫై లైఫ్‌లో సీనియర్ సిటిజన్స్ కూడా యూత్‌కు ఏమాత్రం తీసిపోకుండా, లేటెస్ట్ పాటలకు తగ్గట్టుగా డాన్సులు వేస్తున్నారు. డ్యాన్స్‌తో శరీరానికి మంచి వ్యాయామం అందడమే కాదు.. ఎన్నో లాభాలున్నాయి కూడా.
కండరాల బలహీనత, ఆందోళనకు గురవడం, నైరాశ్యం, ఒత్తిళ్లకు గురికావ డం లాంటి సమస్యలు సాధారణంగా వృద్ధులను వేధిస్తున్నాయనే సంగతి తెలిసిందే. అయితే డ్యాన్స్ చేయడం వల్ల తాతయ్య, అమ్మమ్మల మానసిక స్థితి మెరుగుపడినట్లు ‘జర్నల్ ఆఫ్ ఏజింగ్ అండ్ ఫిజికల్ యాక్టివిటీ‘లో అధ్యయనంలో వెల్లడైంది. క్రమం తప్పకుండా నాట్యం చేయడం వల్ల కండరాలు బలంగా తయారవ్వడం, ఓపిక, సహనం పెరగడం, ఆందోళన, నిరాశ నిసృహ తగ్గడం లాంటివి గుర్తించినట్లు నిపుణులు తెలిపారు.
శారీరక దృఢత్వం
* డ్యాన్స్ శరీర మొత్తంపై ప్రభావం చూపుతుంది. దాంతో శరీరంలోని ప్రతి కండ రానికి వ్యాయామం అందుతుంది.
* డ్యాన్స్ కదలికలు గుండె, ఊపిరితిత్తులను ఆరోగ్యవంతంగా ఉంచుతాయి.
* ఆరోగ్యంతోపాటు ఆయుష్షు.
* నిత్యం డ్యాన్సులు చేసేవారు మెరుగైన ఫంక్షనల్ ఫిట్‌నెస్ కలిగి ఉంటారు.
మానసిక ఆరోగ్యం
* ఏకాగ్రత, జ్ఞాపకశక్తి మెరుగుపడటం
* మానసిక ప్రశాంతత చేకూరడం
* మెదడును బలంగా మార్చేసి న్యూరోప్లాస్టిసిటీని పెంచుతుంది.
* హర్మోన్ బ్యాలెన్స్‌ను అదుపులో ఉంచుతుంది.
ఒత్తిడి దూరం
* నిత్యం డ్యాన్స్ చేయడం వల్ల మానసిక స్థితి మెరుగుపడుతుంది.
* సంగీతానికి లయబద్ధంగా డ్యాన్స్ చేయడం వల్ల ఎండార్ఫిన్లు విడుదలవుతాయి
* ఒంటరితనం నుంచి ఉపశమనం
* ప్రతినిత్యం ఆనందంగా ఉంటారు.
బంధం పెరిగేలా
* డ్యాన్సులతో సామాజిక సంబంధాలను పెంపొందించుకోవచ్చు.
* డ్యాన్సులు చేసేటప్పుడు ఇతర భాగస్వామ్యం కచ్చితంగా అవసరం ఉంటుంది.
* ఇతరులతో డ్యాన్స్ చేయడం వల్ల కొత్త బంధాలు పెరుగుతాయి.
* పాత, కొత్తవారితో కలిసి డ్యాన్స్ చేయడం తరాల మధ్య అంతరాలను తెలుసుకోవచ్చు.
ఎలా మొదలుపెట్టాలి?
* డ్యాన్సులు చేయాలంటే ముందుగా అనారోగ్య సమస్యలను గుర్తించాలి.
* కొత్త వ్యాయామ కార్యక్రమాన్ని కొనసాగించే ముందు మెడికల్ క్లియరెన్స్ ఉండాలి.
* ప్రస్తుత ఫిట్‌నెస్ స్థాయి, ఆరోగ్య స్థితికి సరిపోయే నృత్య శైలిని ఎంచుకోవాలి.
* ముందుగా తేలికపాటి సెషన్లతో ప్రారంభించాలి.
* వినోదంపై దృష్టి పెట్టండి, సాంకేతికత గురించి చింతించకండి.
కొన్ని సమస్యలు
* సీనియర్స్ నృత్యం చేయడానికి కొన్ని సవాళ్లను అధిగమించాల్సి ఉంటుంది.
* కీళ్ల నొప్పులు డ్యాన్స్ చేయడానికి ఇబ్బందులు కలిగిస్తాయి.
* శక్తిని పెంచుకోవడానికి ఫిజికల్ థెరఫిస్ట్‌లను సంప్రదించాలి.
* ‘కిందపడిపోతాం’ అనే ఆందోళనను వీడాలి.
* ఆర్థిక సమస్యలతో బాధపడేవారు ఆన్‌లైన్, యూట్యూబ్ వీడియోలతో ప్రయత్నించాలి.