calender_icon.png 21 September, 2024 | 8:28 AM

మనసు గాయాలే కవిత్వాన్ని పండిస్తాయి

21-09-2024 01:10:30 AM

సాహితీవేత్త నందిని సిధారెడ్డి

కరీంనగర్ సిటీ, సెప్టెంబర్ 20: బతుకు బాటలో ఎదురయ్యే బాధలు, మనసును ముక్కలు చేసే గాయాల పునాదుల్లోంచే క విత్వం ఉద్భవిస్తుందని ప్రముఖ సాహితీవేత్త, తెలంగాణ వైతాళికుడు నందిని సిధారెడ్డి అన్నారు. తెలంగాణ భాషా సంరోణ సం ఘం ఆధ్వర్యంలో బుర్ర నర్సమ్మ స్మారక తెలంగాణ తెలుగు తేజం జాతీయ అ వార్డుకు ఆయన ఎంపికయ్యారు. శుక్రవారం కరీంనగర్‌లోని వాగేశ్వరి డిగ్రీ కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో అవార్డును స్వీకరించి మాట్లాడారు.

మట్టి వాసనలే సాహిత్య ఊటలకు ప్రేరణలని, అమ్మనాన్నల దీవెనలే మన అస్థిత్వమని గుర్తు చేశారు. జీవితంలో అనుభవించే కన్నీళ్లే సాహితీవేత్తకు సిరాచుక్కలని, సాహిత్యం ద్వారా సమాజం చైతన్యవం తం కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా అదనపు కలెక్టర్ జీవీ శ్యాంప్రసాద్‌లాల్, కెప్టెన్ బుర్ర మధుసూదన్‌రెడ్డి, బైస దేవదాసు, దాస్యం సేనాధిపతి, నంది శ్రీనివాస్, బొమ్మకంటి కిషన్, అనుముల దయాకర్, మాడిశెట్టి గోపాల్ పాల్గొన్నారు.