calender_icon.png 26 December, 2024 | 4:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెన్ గంగ నది ఒడ్డున భక్తుల తాకిడి

08-11-2024 09:18:47 PM

సూర్య భగవాన్ కు ప్రత్యేక పూజలు

ఆదిలాబాద్,(విజయక్రాంతి): కార్తీక మాసం పర్వదినాన ఆదిలాబాద్ జిల్లాలోని పెన్ గంగ నది ఒడ్డున భక్తుల తాకిడి పెరిగింది. పెద్దఎత్తున భక్తులు నది ఒడ్డుకు చేరుకుని ఘనంగా సూర్య భగవాన్ కు పూజలు నిర్వహించారు. ఉత్తర భారత దేశంలో మార్వాడి బ్రహ్మన్ సమాజ్ వారు కార్తీక మాసంలో నిర్వహించే సూర్య భగవాన్, చాట్ మాతా పూజలను ఆదిలాబాద్ లోని నివాసముంటున్న మార్వాడి బ్రహ్మన్ సమాజ్ ప్రజలు ఘనంగా జరుపుకున్నారు.

జైనథ్ మండలంలోని పెన్ గంగా నదిలో శుక్రవారం కుటుంబ సమేతంగా పుణ్య స్నానాలను ఆచరించి, సూర్య భగవానునికి జలాన్ని, పాలను సమర్పిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అటు కార్తీక మాసంలో సూర్య భగవాన్, చాట్ మాతాకు పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని పలువురు మహిళలు పేర్కొన్నారు.  కుటుంబ సభ్యులు ఆయురారోగ్యంగా ఉండాలని ఇలా పూజలు నిర్వహించడం జరుగుతోందన్నారు.