12-03-2025 12:25:26 AM
హాజరైన ఎమ్మెల్యే మురళి నాయక్
మహబూబాబాద్, మార్చ్ 11 (విజయ క్రాంతి): గ్రామ దేవతల పూజలు మనకు ఆధ్యాత్మిక శాంతిని, నూతన ఉత్సాహాన్ని ప్రసాదిస్తాయి అని ఎమ్మెల్యే మురళి నాయ క్ అన్నారు. మంగళవారం నెల్లికుదురు మండలంలోని ఎర్రబెల్లిగూడెం సౌల తండా గ్రామం శెనిగెకుంట తండ,తండాలో జరిగిన దుర్గమ్మ పండుగ వేడుకలకు మహబూబాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే డా.భూక్యా మురళీ నాయక్ హాజరై అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ వేడుకల్లో మండల నాయకులు, పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించారు. ఈ సందర్భంగా ఎమ్మె ల్యే మాట్లాడుతూ దుర్గమ్మ పండుగ అనేది భక్తి, ఆధ్యాత్మికత, సంస్కృతి కలయిక. అమ్మవారి కృపతో మన గ్రామాలు అభివృద్ధి చెం దాలి, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉం డాలి‘ అని అన్నారు.
గ్రామ దేవతల పూజలు మనకు ఆధ్యాత్మిక శాంతిని, నూతన ఉత్సాహాన్ని ప్రసాదిస్తాయి. ఈ పండుగను గ్రామ స్థులందరూ కలిసికట్టుగా జరుపుకోవడం ఎంతో ఆనందదాయకం‘ అని చెప్పారు. మ హబూబాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను మరింత మంది ప్రజలకు అందించేందుకు నా పూర్తి సహాయ సహకారం ఉంటుంది అని హామీ ఇచ్చారు.
బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే పరామర్శ
మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండల కేంద్రం ఎస్‌ఆర్‌ఎస్పి కెనాల్ ప్రమాద బాధిత కుటుంబాన్ని మానుకోట ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ పరామర్శించారు. వివరాల్లోకి వెళితే మహబూబా బాద్ జిల్లా నెలకుదురు మండలం మేషరాజపల్లి గ్రామానికి చెందిన సోమారపు ప్రవీణ్ తన కుటుంబ సభ్యులతో సెలవుల నిమిత్తం తల్లిదండ్రులతో కలిసి సంతోషించేందుకు తన కారులో ప్రయాణిస్తూ శనివారం ఎస్సారెస్పీ కాలువలోకి దూసుకెళ్లిన ఘటనలో తండ్రితో పాటు కుమారుడు కూతురు మృతి చెందిన విషయం అందరికీ తెలిసిందే.
కాగా మానుకోట ఎమ్మెల్యే ముర ళి నాయక్ మంగళవారం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండ గా ఉంటుందని మనోధైర్యం తో ముందుకెళ్లాలని అధైర్య పడవద్దని కుటుంబానికి భరో సానిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మండల నాయకులు డైరెక్టర్లు మాజీ ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.