calender_icon.png 21 January, 2025 | 2:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బసవన్నలకు మాజీ మంత్రి జోగు రామన్న దంపతుల పూజలు

02-09-2024 07:38:43 PM

నిజమైన దేవుళ్ళు రైతన్నలే...

ఆదిలాబాద్, (విజయక్రాంతి): జనం గుండెల్లో నిండిన నిజమైన దేవుడు సాక్షాత్తు రైతేనని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. పొలాల పండగ సందర్భంగా తన స్వగ్రామమైన జైనథ్ మండలం దీపాయిగూడలో పొలాల అమావాస్య పండగను సోమవారం ఘనంగా జరుపుకున్నారు. ముందుగా బసవన్న లను సతీమణి జోగు రమ తో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. బసవన్న లను నైవేద్యం సమర్పించి హారతులులిచ్చారు. ఏడాది పాటు వ్యవసాయ రంగంలో రైతులకు అండదండగ నిలిచి బసవన్న లను పూజించే పండుగనే  పొలాల పండగ అని జోగు రామన్న అన్నారు. జిల్లా ప్రజలకు, రైతు కుటుంబాలకు పొలాల అమావాస్య పండగ శుభాకాంక్షలు తెలియజేశారు. పాడి పంటలు సమృద్ధిగా పండి రైతులకు సుఖశాంతులు కలగాలని కోరుకున్నారు. అధిక వర్షాలు నేపథ్యంలో రైతులు చేనులో పనులలో కాస్త జాగ్రత్తలు వహించాలని సూచించారు.