14-03-2025 12:00:00 AM
భద్రాద్రి జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో అవినీతి జోరు
టీవీల ఏర్పాట్లు కమిషన్ల దందా
టెండర్లు లేకుండానే పనులు కేటాయింపు
రూ 38 .66 లక్షలు స్వాహా
భద్రాద్రి కొత్తగూడెం మార్చి 13 (విజయ క్రాంతి): రాజుల సొమ్ము రాళ్లపాలు... ప్రజల సొమ్ము అక్రమార్కుల పాలు అన్నట్లు ఉంది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని వైద్య ఆరోగ్యశాఖ పనితీరు. జిల్లాలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ల సుందరీ కరణ చేసేందుకు ప్రభుత్వం విడుదల చేసిన నిధుల్లో భారీ స్థాయిలో గోల్మాల్ చోటు చేసుకుందని ఆరోపణలు వెలబడుతున్నాయి. 2020-2021 ఆర్థిక సంవత్సరానికి గాను ఆస్పత్రుల సుందరీకరణకు ప్రభుత్వం రూ 24,99, 309 నిధులను మంజూరు చేశారు. వీటితో జిల్లాలోని ఆస్పత్రులకు రంగులు వేయాల్సి ఉంది.
వాస్తవంగా ఆసుపత్రులకు రంగులు వేసేందుకు జిల్లా స్థాయి లో టెండర్లు పిలిచి తక్కువకు కోడ్ చేసిన వారికి పనులు అప్పగించాల్సిన నిబంధనలు ఉన్నాయి. అందుకు విరుద్ధంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి నిబంధనలను తుంగలో తొక్కి తనకు నచ్చిన కమిషన్ ఎక్కువ ఇచ్చిన హైదరాబాదుకు చెందిన ఎం/ఎస్ కేంద్రీయ బండార్ అనే సంస్థకు దొడ్డి ధారణ పనులు అప్పగించినట్లు తెలుస్తోంది. వాస్తవంగా ఈ నిధులు జిల్లాలోని ఆసుపత్రుల వైద్యుల ఖాతాలో జమ చేయా ల్సి ఉంటుంది. ఆస్పత్రికి రంగులు వేసిన తర్వాత వైద్యులు సంతృప్తి చెందిన తదుపరి కాంట్రాక్టర్కు వైద్యాధికారి నిధులు డ్రా చేసి ఇవ్వాల్సి ఉంది.
అందుకు విరుద్ధంగా నేరుగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కేంద్రీయ బండార్ సంస్థకు పి పి ఏ ఏ నెంబర్ సి 032164259116 ద్వారా 2021 మార్చి 27 నా మంజూరైన నిధుల కంటే అదనంగా రూ 38,66,910 డ్రా చేసి చెల్లించటంతో అనుమానాలకు దారితీస్తోంది. టెండర్లు పిలవలేదు, పనులు జరగలేదు, నిధులు మాత్రం డ్రా చేశారని తెలుస్తోంది. అంతేకాదు మంజూరైన నిధులకు మించి రూ13,69,601 నిధులు చెల్లించడంలో మొదలగు ఏంటో ఆ జిల్లాస్థాయి అధికారికే తెలియాలి. ప్రభుత్వం నిరుపేదలకు మెరుగైన వైద్యం కోసం నిధులు విడుదల చేస్తుంటే అధికారులు మాత్రం అందిన కాటికి దండుకుంటున్నారనే విమర్శలు వస్తున్నాయి.
టీవీల కొనుగోలు నిధులు గల్లంతు
ప్రభుత్వ ఉన్నతాధికారులు, జిల్లాస్థాయి అధికారులు నేరుగా ప్రాథమిక వైద్య అధికారులతో టెలికాన్ ఫ్రెన్స్ నిర్వహించేందుకు ప్రతి ఆసుపత్రిలో టీవీలు కెమెరాలు ఏర్పాటు చేయాలని నిబంధన విధించారు. అందుకు అవసరమైన నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. అదే తరహాలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 30 ఆసుపత్రులకు 2021 సంవత్సరానికి గాను 30 టీవీలకు నిధులు కేటాయించారు. టీవీలు కెమెరాలు కొనుగోలుకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ టెండర్లు ఆహ్వానించారు. ఈ టెండర్లకు కొత్తగూడెంకు చెందిన పూర్ణ మొబైల్స్, వీటైమ్ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, సూర్యాపేటకు చందా అద్వైత ఎంట్ర్పజెస్ అనువారు టెండర్లు తాగరు చేశారు. కొత్తగూడెంకు చెందినవారు వీటైమ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ అనే సంస్థ టీవీ రూ 24 ,499, కెమెరా రూ 2,999 సరఫరా చేసేందుకు మిగతా వారి కంటే తక్కువ ధరకు కోడ్ చేశారు. నిబంధనల ప్రకారం ఎవరైతే తక్కువ ధరను కోడ్ చేస్తారు వారికే పనులను అప్పగించాల్సి ఉంది.
సదరు జిల్లా స్థాయి అధికారి అసలు టెండర్ లో పాల్గొనని హైదరాబాద్ కు చెందిన కేంద్రీయ బండారు సంస్థకు టీవీలు కెమెరాలు సరఫరా చేసేందుకు2021 మార్చి 10 నా వర్క్‌ఆర్డర్ ఇవ్వటం గమనార్హం. అంతేకాదు వర్క్ ఆర్డర్ పొందిన 10 రోజుల వ్యవధిలో అన్ని ఆసుపత్రిలో టీవీలు అమర్చాలని ఆదేశాలు కూడా జారీ చేశారు. టీవీలు సరఫరా కాకముందే 6 రోజుల వ్యవధిలోనే సదరు కాంట్రాక్టర్‌కు 2021 మార్చి 16న పి పి ఏ నెంబర్ సి 032134604202 ద్వారా రూ8,35,503 నిధులు డ్రా చేసి చెల్లించినట్లు తెలుస్తోంది. పనులు 10 రోజుల్లో చేయాలన్న అధికారులు 6 రోజుల్లోనే నిధు లు డ్రా చేయడంలో మతలబ్ ఏంటో ఇట్టే తెలిసిపోతుంది. వాస్తవంగా ఆసుపత్రుల్లో టీవీలో అమర్చిన తర్వాత పనిచేస్తుంది లేనిది స్థానిక వైద్యాధికారి స్వయంగా పరిశీలించి కాంట్రాక్టర్కు నిధులు చెల్లించాల్సి ఉంది.
కానీ సదరు జిల్లా అధికారి నేరుగా కాంట్రాక్టర్లకు టీవీలు అమర్చకముందే నిధు లు చెల్లించడం పై అనేక ఆరోపణలు అనుమానాలు తలెత్తుతున్నాయి. నిధులు చెల్లిం చిన ఏడాది తర్వాత కూడా కొన్ని ఆసుపత్రిలో టీవీలు లేకపోవడం, అమర్చిన టీవీ లు పనిచేయకపోవడంతో నిధులు గోల్మాల్ జరిగినట్లు వస్తున్న ఆరోపణలను ధ్రువపరుస్తోంది. పాల్వంచ పట్టణ పరిధిలోని శేఖరం బంజర్ పట్టణ ఆరోగ్య కేంద్రంలో సరఫరా చేసిన టీవీ గత ఏడాదిగా పనిచేయడం అది కేవలం గోడకు అలంకారప్రాయంగానే ఇది ఒక మచ్చ తునక జిల్లాలో అనేక వైద్య ఆరోగ్య కేంద్రాల్లో ఇదే పరిస్థితి నెలకొని ఉంది.
వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ విషయమై డిఎం అండ్ భాస్కర్ నాయకుడు వివరణ కోరగా నిధుల స్వాహా అవాస్తవమని, నిబంధనల ప్రకారమే టెండర్లు నిర్వహించి టీవీలు ఏర్పాటు చేయటం, ఆస్పత్రులకు రంగులు వేయడం జరిగిందన్నారు.